వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42 వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బి రాములు మాట్లాడుతూ 19 82 లో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుజాతి గౌరవాన్ని భారతదేశ శిఖరాలపై జెండాను ఆవిష్కరించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కిందని ఆయన కొనియాడారు బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు 42వ తెలుగుదేశం పార్టీ వార్షికోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న నాయకులకు జెండాను మోసిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ వేడుకలలో తెలుగుదేశం నేతలు హోటల్ బలరాం మేదరి బాలయ్య ఎండి దస్తగిరి నందమూరి బాలకృష్ణ అభిమాని దస్తగిరి డి బాలరాజ్ కొత్త గొల్ల శంకర్ గొల్ల వెంకటయ్య న్యాయవాదులు మోహన్ కుమార్ యాదవ్ ఫారుక్ తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు
