తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో గౌడ సంఘం మరియు యువసేన సంఘం ఆధ్వర్యంలో సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ 314 వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా పాక్స్ చైర్మన్ కోడూరు భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ 16వ శతాబ్దం నాటి బాహుబలి విప్లవ యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ 400దాటిన ఆయన పేరు ముఖ్యంగా తెలంగాణలో పరిచయం ఉన్న వ్యక్తిగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ స్థిరస్థాయిగా నిలిచిపోతారని తెలియజేస్తూ రాజకీయ పార్టీల తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకా ఆయన ఆశయాలను ఎల్లవేళలా కొనసాగిస్తామని గౌడలు ఐకమత్యంతో ముందుకు సాగాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో గౌడ యువసేన అధ్యక్షులు తాళ్లపల్లి రాజు గౌడ్ ఉపాధ్యక్షులు కోడూరు నరేష్ గౌడ్ మరియు సభ్యులు సంతోష్ భాస్కర్ నరసయ్య రాములు భానుచందర్ ప్రశాంత్ విజయ్ ఆంజనేయులు శ్రీనివాస్ తిరుపతి గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు