రామడుగు/చోప్పదండి, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చోప్పదండి పెద్దకుర్మపల్లి గ్రామంలో 2కె, 5కె రన్నింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామంలోని యువకులలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం కోసం ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు అమ్ముల రాజు, కూకట్ల తిరుపతి, నూనుగొప్పుల రాజులు తెలియజేశారు. అనంతరం పరుగు పూర్తి చేసుకున్న యువకులకు బహుమతులు అందజేశారు.