కొనరావుపేట, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గిరిజన ఆరాధ్య దైవం సంశ్రీశ్రీ సేవలల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ. మండల కేంద్రంలో గిరిజనలకు గిరిజన భవన్ కోసo స్థలం కేటాయించాలి, ప్రభుత్వం సేవలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి. ఆప్షన్ హాలిడే కాకుండా సంపూర్ణ సెలవు దినంగా ప్రకటించాలి. ప్రతి మండల కేంద్రంలో టాను నాయక్ విగ్రహం ప్రతిష్ట చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ , రాష్ట్ర సమన్వయకర్త రమేష్ నాయక్, సిద్ జాదవ్, ప్రజా ప్రతినిధులు, గిరిజన సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.