ఉప్పల్ నేటిధాత్రి జూలై 31:
కార్గిల్ వార్ లో వీర మరణం పొందిన కెప్టెన్ ఆర్. వీర రాజ రెడ్డి 22 వ వర్ధంతి సందర్భంగా హబ్సిగుడ స్ట్రీట్ నంబర్ 8 వద్ద గల ఆయన విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఆయన చేసిన సేవలు అభినందనీయం అని ఆయన అన్నారు.
దేశానికి సేవ చేసే క్రమంలో వీర మరణం పొందిన కెప్టెన్ రాజ రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారు అని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి భారాస పార్లమెంట్ ఇంచార్జి రాగిడి లక్ష్మా రెడ్డి ,కంచర్ల సోమిరెడ్డి హబ్సిగూడ భా రా స మాజీ జనరల్ సెక్రటరి ,లక్శ్మి నారాయణ ఉప్పల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ,కైలాశ్ పతి గౌడ్ మాజీ కౌన్సిలర్ ,వీరేందర్,శ్యామ్ ,రాజమోహన్ రెడ్డి ,నాని కుటుంబ సభ్యులు మురళి దర్ సుచిత్ర రెడ్డి విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు