జోగులాంబ గద్వాల్ జిల్లా, నేటిధాత్రి: అలంపూర్ నియోజక వర్గం రాజోలి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మాలకొండయ్య ఉత్తమ వైద్యుడిగా అవార్డు ను జిల్లా కలెక్టర్ శృతి ఓజా చేతుల మీదుగా జిల్లా కేంద్రం లోని గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు ను అందుకున్నారు. డాక్టర్ మాలకొండయ్య కు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, రోగుల పట్ల అంకితభావం తో పనిచేసి ప్రజల మధ్య నే ఉంటూ వైద్య ఆరోగ్య సేవలు అంించేందుకు ఎంతో కృషి చేశారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయ్ స్ యూనియన్ జోగుళాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ ప్రశంసించారు. డి పి ఎమ్ ఓ. మల్లికార్జున, మెడికల్ ఆఫీసర్ లు జ్యోత్స్న దేవి, జయమ్మ, రంజిత్ కుమార్, ఉలిగెమ్మ, ఏ ఎన్ ఎమ్ లు ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేశారు