భద్రాచలం నేటిదాత్రి
స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే 197 వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియార్ వహించగా మహానీయుల జయంతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు గురజాల వెంకటేశ్వర్లు ల ఆధ్వర్యంలో ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని మాట్లాడుతూ… సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే అని,బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని,అంటరానితనాన్ని రూపుమాపడం కోసం కృషిచేసిన సంఘసంస్కర్త అని, మహిళా విద్య అభివృద్ధికి మార్గదర్శి నిత్య స్ఫూర్తి ప్రదాత అని, సామాజిక అసమానతలు తొలగించిన కాంతిరేఖ దీన జనుల జీవితాల్లో వెలుగు రేఖ మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు.ఫూలే గారి సేవలు ఈ సమాజంలో చిరస్మరణయం, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు అన్నారు.అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ భాను ప్రసాద్, ఈటె రాజేశ్వరరావు, భీమపాక పెదరాజు, అరికెళ్ల తిరుపతిరావు, జయశంకర్ రావు, చాట్ల రవికుమార్, మామిడి పుల్లారావు, మదర్ తెరిసా ట్రస్ట్ నిర్వాహకులు కొప్పుల మురళి, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఉపేందర్,ఇసంపల్లి ముత్యం, న్యాయవాది ఆవులూరు సత్యనారాయణ, న్యాయవాది పేరాల నాగరాజు, న్యాయవాద విద్యార్థిపర్నందిఅనిల్, ఎమ్మార్పీఎస్ నాయకులుకొమ్మగిరి వెంకటేశ్వర్లుమాదిగ, కోట ప్రభాకర్ మాదిగ, వల్లే పోగు రాంబాబు, బేడ బుడగ జంగం నాయకులు పసుపులేటి వెంకటేశ్వర్లు ,దళిత ఉద్యమ నాయకులు గద్దల బాబురావు, పూస శ్రీనివాస్,గాడిద రాఘవులు, ధర్మ సమాజ్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మోదుగ ప్రకాష్, పట్టణ అధ్యక్షులు వేల్పుల వెంకన్న, ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేకల లత, జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల నాగమణి, అధికార ప్రతినిధి తెల్లం సమ్మక్క, మాదిగ దండోరా జిల్లా మహిళ అధ్యక్షురాలు వెంకట నరసమ్మ, కొక్కెరపాటి , బాసిపోగు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమ వందనాలతో..
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ. భద్రాచలం