డీసీఎంఎస్, పిఎసిఎస్ పేర్లతో రైతులను క్వింటాలు186.72 మోసం.

వడ్ల కొనుగోలు సెంటర్ ఇన్చార్జి బొమ్మ రమేష్ రెడ్డి.

నేటిధాత్రి. మలహార్ రావు :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో వల్లంకుంట, ఏడ్లపల్లి, కొయ్యూర్, గ్రామాల నిరుపేద రైతులు ప్రజావాణిలో కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వివరాల్లోకెళ్తే
గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆగ్రోస్ ఫెర్టిలైజర్ పేరుతో బొమ్మ రమేష్ రెడ్డి అనే వ్యక్తి పురుగుమందుల దుకాణం నడుపుతూ పేద రైతులను ఎరువులు అమ్మతూ దోపిడీకి పాల్పడుతున్నాడు. నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయాలు జరుపుకున్నట్లు వ్యవసాయ అధికారులు కూడా ఇటీవల గుర్తించడం జరిగింది.


కొయ్యూర్, వల్లెంకుంట, ఏడ్లపల్లి గ్రామాలలో బొమ్మ రమేష్ రెడ్డి అనే వ్యక్తి వడ్ల కొనుగోలు సెంట్రర్ లను పలు బినామీ పేర్లతో గత10 సంవత్సరాలుగా పెద రైతులను మోసగింస్తు వస్తున్నాడు. తను డిజిటల్ కాంటాలకు బాదులు మ్యానువల్ కాంటాల ద్వారా రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో కాంటాల తూకం చేస్తూ రైతులను నిలువునా దోపిడీ చేస్తూ వస్తున్నాడు. ఈ మోసాన్ని అధికారుల అండదండలతో లబ్ధి పొందుతున్నడని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సీజన్ కు గాను సుమారు క్వింటాలు186.72 కిలోల ధాన్యాన్ని రైతుల పక్షాన మోసగించడం జరిగింది. ఇంకా తెలియ కుండా వెలుగులోకి రాణి నిరు పెద రైతుల వడ్లా ను ఎన్ని క్వింటాళ్లు మోసం చేశాడో తెలియదు కావున రైతులకు తగిన న్యాయం జరగాలంటే కలెక్టర్ చొరవ చేసుకొని ఉన్నత అధికారులతో పూర్తి ఎంక్వయిరీ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటూ రైతులకు తగిన న్యాయంజరిగేవిధంగా ప్రజావాణిలో వివిధ గ్రామాల రైతులు వేడుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *