హిందూ సేవా సమితి అధ్యక్షులు కట్టా నరసింగరావు
కూకట్పల్లి జనవరి 08 నేటి ధాత్రి త్రి ఇంచార్జ్
కెపిహెచ్బి కాలనీ శ్రీ వెంకటేశ్వర బస్తి ఆధ్వర్యంలో గడప గడపకు అయో ధ్య రాముల వారి అక్షితల వితరణ కార్యక్ర మములో భాగంగా ఈరోజు 3వ ఫేస్ LIG బ్లాక్ నంబర్ 104 నుంచి 118 వరకు వున్న 180 ఇళ్ల కు వెళ్ళి అయోధ్య రాముల వారి అక్షితలను పంపిణీ చేయడం జరిగి నది.ఈ సందర్భముగా తెలం గాణ హిందూ సేవా సమితి అధ్యక్షులు కట్టా నరసింగరావు మాట్లాడుతూ 500వందల యేళ్ళ తరువాత, ఎంతో మంది ఆత్మబలి దానాల అనంతరం హిందూ ధర్మ విజయా నికి ప్రతీకగా శ్రీరాముని జన్మస్థ లమైన అయోధ్య నిలిచిందన్నా రు.ఈ నెల 22వ తేదీన శ్రీ రాము లవారి విగ్రహ పునఃహ ప్రతిష్టతో మందిర ప్రారంభోత్సవాన్ని ప్రజలం దరు ప్రసారమాధ్యమాల ద్వారా తిలకించి పునీతులు కావాలని, అదే రోజు సాయంత్రం హిందూ బంధువు లంతా తమ తమ ఇళ్ళ ముందు 5 దీపాలు వెలిగించి అయోధ్య శ్రీ రామ మందిర ప్రారంభాన్ని గొప్ప పండుగగా జరుపుకోవాలని అన్నా రు.ఈ కార్యక్రమములో పచ్చమట్ల వెంకట సత్తిరాజు,ఏనూతుల మహే ష్, ఎస్ రఘురామ్,కొల్లా శంకర్,
గోలి పద్మారెడ్డి పెద్ద భారతి,శోభ, కమలమ్మ, విద్య,చిన్న భారతి, కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 1లో….