రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ మరో ఇద్దరు పరారీ
నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు
గంజాయి రవాణా దారుని చాకచక్యంగా పట్టుకున్న సిఐ రాఘవేందర్,
స్టేషన్ ఘనపూర్: (జనగాం) నేటి ధాత్రి
స్టేషన్ ఘన్ పూర్, రైల్ లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి (రూ. 3 లక్షల విలువ చేసే 15 కిలోలు) స్వాధీనం చేసుకుని రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ పంపినట్లు ఏసిపి ఎస్.శ్రీనివాస్ వెల్లడించారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర లోని పూనేలో ఒక జ్యూస్ కంపెనీ యజమాని యూనిస్ ఖాన్ వద్ద రాజ్ కుమార్ కౌల్ రోజు కూలిగా పని చేస్తున్నాడు. రాజ్ కుమార్ కు మాము అనే వ్యక్తిని పరిచయం చేసి గంజాయి రవాణా చేయించేందుకు వారిద్దరిని ఒడిస్సా పంపాడు. ఒడిస్సా లో పడవ అనే గ్రామానికి వెళ్లి దశరథ్ అనే వ్యక్తిని కలిసి అతడి వద్ద నుండి 15 కిలోల గంజాయిని కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో ముంబై తరలిస్తున్నారు. ఈ క్రమంలో తనతో వచ్చిన మాము రైల్ లో కనబడకపోవడంతో ఆందోళన చెందిన రాజ్ కుమార్ కౌలు ట్రైన్ చైన్ లాగి స్టేషన్ ఘన్ పూర్ లో దిగిపోయాడు. రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజేష్ కుమార్ కౌలు ను పోలీసులు అదుపులోనికి తీసుకొని విచారించగా వివరాలు వెల్లడించినట్టు ఎసిపి శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మరో ఇద్దరు నిందితులు పరారులో ఉన్నట్లు ఏసిపి తెలిపారు. గంజాయి రవాణా దారుని చాకచక్యంగా పట్టుకున్న సిఐ రాఘవేందర్, ఎస్సై నాగరాజు, కానిస్టేబుల్స్ శ్రీనివాస్, అనిల్, రవిప్రసాద్, కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, ఆర్పిఎఫ్ సీఐ టిఎస్ఎన్ కృష్ణ ను ఏసిపి అభినందిచారు. నిందితుడు మధ్యప్రదేశ్ కు చెందిన
రాజ్ కుమార్ కోల్, ఇటావురా గ్రామం విజయరాగవగర్, కట్ని జిల్లాకు చెందినవాడుగా గుర్తించారు.