15వ తేదీన టెట్ ఎగ్జామ్స్ పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

# విద్యార్థులందరూ హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి

# పరీక్షలు రాసే విద్యార్థులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి

# ఓఎంఆర్ షీటును బబుల్స్ నింపేటప్పుడు బ్లాక్ రీఫిల్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి.

# పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోను అనుమతించబడదు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈనెల 15వ తేదీన టెట్ ఎగ్జామ్స్ నిర్వహణలో భాగంగా జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టెట్ పరీక్షల నిర్వహణ కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సెప్టెంబర్ 15న ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు రెండవ పేపర్ ఉంటుందని కలెక్టర్ అన్నారు. జిల్లా లో 8 పరీక్షా కేంద్రాలు తెలంగాణ మోడల్ స్కూల్ బండారుపల్లి, జవహర్ నగర్, చల్వయి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ములుగు, జెడ్ పి హెచ్ ఎస్ గర్ల్స్, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ బాయ్స్, ములుగు
జెడ్ పి హెచ్ ఎస్ పస్రా గోవిందరావుపేట లలో ఏర్పాటు చేసామని ఉదయం నిర్వహించే మొదటి పరీక్షకు 1892 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం నిర్వహించే రెండవ పరీక్షకు 1295 మంది అభ్యర్థులు హాజరవుతు న్నారని కలెక్టర్ తెలిపారు విద్యాశాఖ అధికారులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా విద్యార్థులకు సూచనలు ఇవ్వాలని విద్యాశాఖ కార్యాలయంలో హెల్ప్ డేస్ ఏర్పాటు చేసి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రం సమీపంలో జిరాక్స్ షాపులు మూసివేయాలని అన్నారు. ప్రశ్న పత్రాల తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, పంచాయతీ శాఖ అధికారులు పారిశుధ్యం మరుగుదొడ్ల నిర్వహణ కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్దకు బస్సులు ఏర్పాటు చేయాలని, నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అన్నారు వైద్య శాఖ అధికారులు ప్రతి పరీక్ష కేంద్రంలో డాక్టరు ఉండే విధంగా చర్య తీసుకోవాలని శిబిరం ఏర్పాటు చేయాలన్నారు పరీక్షా కేంద్రాల నిర్వహణకు రెండు రూట్లను ఏర్పాటు చేయడం అధికారులకు విధులు కేటాయించడం జరిగిందని సంబంధిత అధికారులకు వాహనాలను సమకూర్చాలని ఆర్టిఏ అధికారుల్ని ఆదేశించారు అలాగే పరీక్షలు వ్రాసే విద్యార్థులు కూడా ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతూ ముందుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని సందేహాలు ఉంటే విద్యాశాఖ అధికారుల హెల్ప్ డెస్క్ ను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు విద్యార్థులు ఓఎంఆర్ షీట్ బబుల్స్ను నింపేందుకు బ్లాక్ రీఫిల్ పెన్నును మాత్రమే వినియోగిం చాలని ప్రత్యేకంగా సూచించారు బ్లాక్ ఇంకు పెన్ను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదని విజ్ఞప్తి చేశారు అభ్యర్థులు మొబైల్ ఫోన్లను పరీక్షా కేంద్రాలకు తీసుకొని రాకూడదని తెలిపారు పరీక్షా కేంద్రాల నిర్వహణ తీరును నోడల్ అధికారులు సమర్థవంతంగా నిర్వహించే విధంగా కృషి చేయాలన్నారు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉన్నదని, ఎవరైనా అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై ఫోటో కానీ, సంతకం కానీ లేనట్లయితే గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో అనుమతించాలని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డిఎస్ వెంకన్న డి ఈ ఓ పాణీని, ప్రిన్సిపల్ బి. వెంకన్న, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అప్పని జయదేవ్,తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version