ముఖ్యాథిధిగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
మంచిర్యాల జిల్లా బెల్లం పల్లి నేటిదాత్రి:
విశిష్ట అథిదులుగా పాల్గొన్న అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్ ఐఏయస్,
సంక్షేమ గురుకులాల ఓఎస్డీ రమణారావు.
బెల్లంపల్లి సిఓఈ లో అట్టహాసంగా ప్రారంభమైన జోనల్ గేమ్స్
పాల్గొన్న జోన్ వన్ (కాళేశ్వరం జోన్) 11 బాలుర గురుకులాలు
సంక్షేమ విద్యార్ధులతో పండగ వాతావరణం సంతరించుకున్న సిఓఈ క్రీడామైదానం.
దేశభక్రి ఉప్పొంగేలా సాగిన విద్యార్ధుల మార్చ్ ఫాస్ట్
అలరించిన విద్యార్ధుల నృత్యాలు.
స్వయంగా వాలీబాల్ ఆడి క్రీడలను ప్రారంభించిన కలెక్టర్ ,అడిషనల్ కలెక్టర్
జోన్ వన్ కాలేశ్వరంజోన్ 9వ జోనల్ స్థాయి సాంఘిక సంక్షేమ గురుకులాల క్రీడాపోటీలు శుక్రవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సిఓఈ), బెల్లంపల్లిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.4 రోజులపాటు జరిగే ఈ క్రీడలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ ఐఏఎస్ ప్రారంభించారు.అనంతరం సిఓఈ ప్రిన్సిపల్ ఐనాల సైదులు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడా మైదానం ప్రతి వ్యక్తిలో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే గొప్ప ఆలోచనా దృక్పధాన్నీస్తుందన్నారు. విద్యార్ధులు క్రీడా స్ఫూర్తి వదలకుండా ఆటల్లో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు.సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి పలు స్థాయిల్లో క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల శారీరక,మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా తెలిపారు.సంక్షేమ గురుకులాల్లో చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వడం వల్లనే ఇటీవల నందిని ఏషియన్ గేమ్స్ లో పథకం సాధించిందన్నారు.సంక్షేమ గురుకుల ఫిజికల్ డైరెక్టర్స్ మరియు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ శిల్పాలుగా మలవడం అభినందనీయమన్నారు. బెల్లంపల్లి సిఓఈ ఇపాటివరకు చదువుల నిలయంగా ఉందని,ఈ జోనల్ గేమ్స్ నిర్వహణతో క్రీడాకారులకు పుట్టినిల్లుగా మారిందని ఈ సందర్భంగా అభినందించారు.క్రీడా మైదానాన్ని ఉత్తమంగా తయారు చేయడంలో ప్రిన్సిపల్ సైదులు కృషి, సిబ్బంది శ్రమ ఆదర్శనీయమన్నారు.
క్రీడలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదిరించి గెలిచే శక్తినిస్తాయి
– మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్ ఐఏయస్.
విశిష్ట అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ క్రీడలు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదిరించి గెలిచే శక్తినిస్తాయన్నారు.విద్యార్థులు రంగురంగుల టి షర్ట్స్ దరించి క్రీడా స్ఫూర్తితో క్రీడా మైదానాన్ని అలంకరింప చేసి బెల్లంపల్లి కి శోభాయమానమైన వాతావరణాన్ని సంతరింపజేశారన్నారు.విద్యార్థులను చూస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు. కావలసిన సౌకర్యాలు విద్యార్థులకు అందజేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్న బెల్లంపల్లి సి ఓ ఈ ప్రిన్సిపల్ సైదులు ఆయన బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మరియు ఇతర అథిధులు జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం త్రివర్ణ పథాకం,ఓలంపిక్స్ మరియు సొసైటీ పఠాకాలను వరుసగా జిల్లా కలెక్టర్ సంతోష్ ఐఏయస్,అడిషనల్ కలెక్టర్ రాహుల్ ఐఏయస్,గురుకుల సంస్థ ఓఎస్డీ రమణారావులు ఆవిష్కరించారు.
కార్యక్రమంలో భాగంగా క్రీడా మైదాన ఓవరాల్ ఇన్చార్జ్ ఫిజికల్ డైరెక్టర్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ ఒళ్ళు పులకించేలా చేసింది. ముఖ్యంగా బెల్లంపల్లి సిఓఈ విద్యార్థుల బ్యాండ్ ట్రూప్ చేసిన విన్యాసాలు అలరించాయి.జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా వారి మార్చి ఫాస్ట్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.అనంతరం క్రీడాకారులందరిచేత కలెక్టర్ సమక్షంలో ఓఠ్ సెరమని( క్రీడా ప్రతిజ్ఞ)సీనియర్ పిడి రవి ఆద్వర్యంలో చేయించారు.అనంతరం రెబ్బన బాలికల గురుకుల విద్యార్థుల స్వాగత నృత్యం ఆకట్టుకుంది. అదేవిధంగా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలికల మరియు బాలుర సిఓఈ బెల్లంపల్లి విద్యార్థుల ప్రత్యేక డాన్సులు క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
చివరిగా ముఖ్య అథిధులకు ప్రిన్సిపాల్ ఐనాల సైదులు జోనల్ గేమ్స్ ప్రత్యేక జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సైదులును కలెక్టర్ సంతోష్ నాయక్ ఐఏయస్ శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి తహశీల్దార్ బి.సుధాకర్,మున్సిపాల్ కమీషనర్ కె.సమ్మయ్య,ఎం ఈ ఓ పి.మహేశ్వర రెడ్డి,లైన్స్ క్లబ్ అద్యక్షులు తిరుపతి రెడ్డి,జోనల్ గేంస్ ఒవరాల్ ఇంచార్జ్ దాసరి ప్రసాద్,సీనియర్ పిడి లు రవి,శ్రీధర్, అల్లూరి వామన్,ఆదిలాబాద్ జిల్లా డిసిఓ సంగనబట్ల శ్రినివాస్,ప్రిన్సిపల్స్ లలితకుమారి,పి.జ్యోతి,సంధ్యారాణి,ఊటూరి సంతోష్,ఊటురి శ్రీనాద్,సౌదా వినోద్,సందారాజ స్వరూప,బెల్లంపల్లి వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్ కుమార్ జెవిపి కొక్కుల రాజేష్ నాలుగు జిల్లాల నుండి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు.అధ్యాపకులు పాగొన్నారు.