భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి డి.జి.సాయిలు గౌడ్
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 26 : భారత దేశ గడ్డపైన కమ్యూనిస్టు పార్టీకి ప్రజా ఉద్యమాలకు వందేళ్లని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి డి.జి.సాయిలు గౌడ్ అన్నారు. మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, శామీర్ పేట్ మండల కేంద్రం పెద్దమ్మ కాలనీ ధర్మ బిక్షం భవన్ స్థలం వద్ద శుక్రవారం భారత కమ్యూనిస్టు పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ గడిచిన వందేళ్లలో ప్రజల జీవన విధి విధానాలపైన అనేక సమస్యల పైన, కార్మిక, కర్షక, అసంఘటిత రంగాల మెరుగైన జీవనం కోసం సుదీర్ఘ పోరాటాలు చేస్తున్న పార్టీగా కొనసాగుతుంది. ప్రజలపై ఆర్థిక భారాలు, బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల ద్వారా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపు నెట్టివేయబడుతున్న సందర్భంలో ఉన్నామని తెలియజేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాజకీయ శక్తిగా ఎదగడానికి కావలసినంత పునాది సిద్ధంగా ఉందని నిరుపేద, మధ్యతరగతి ప్రజల న్యాయమైన హక్కుల సాధన కోసం సంఘటితం అవ్వాలని పిలుపునివ్వడం జరిగింధన్నారు. ఈ కార్యక్రమలో డి.జి. నరేందర్ ప్రసాద్ స్థానిక శాఖ కార్యదర్శి దొంతర పోయిన భూమయ్య, సోగాడ రమేష్, గాయత్రి, వసంత జీవన్, ప్రధాన్, దిగంబర రాజు పి రాణి లక్ష్మీదేవి స్థానిక కార్మికులు పాల్గొన్నారు.

