నకిలీ ప్రకటనలు చూసి మోసపోవద్దు
జిల్లా ఎస్పీ అఖిల మహాజన
వేములవాడ,నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎస్పీ అఖిల మహాజన్ శనివారం సోషల్ మీడియాలో సైబర్ మోసగాళ్ళు చేసే మోసాల పట్ల ప్రజలకు పలు సూచనలు, జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ
సోషల్ మీడియాలో నకిలీ ఉద్యోగల పేరుతో వచ్చే లు మోసపురితమైన లింక్ లిక్స్, ప్రకటనలు చూసి మోసపోవద్దని, అధిక లాభాల కోసం ఆశపడి ఆన్లైన్ లో పెట్టుపడి పెట్టడం లేదా ఎవరో చెప్పింది విని సోషల్ మీడియాలో యాడ్స్ చూసి మోసపోవద్దని తెలిపారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100లకు తక్షణమే కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదని, ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారన్నారు. కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, నకిలీ లాటరీలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం, నకిలీ గిఫ్టు బాక్సులు, లోన్ యాప్ మొదలగు వంటి వాటిని చూసి ప్రజలు మోసపోవద్దని, వీటి పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930కి కాల్ చేస్తే పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చన్నారు. ఈ సందర్బంగా
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఈ వారం రోజులు వ్యవధిలో జరిగిన కొన్ని సైబర్ నేరాలను ఎస్పీ వెల్లడించారు.
బోయినిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితునికి వాట్సాప్ లో గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందని, ఖాళీ సమయంలో పార్ట్ టైం జాబ్ ద్వారా సంపాదించవచ్చని టెలిగ్రామ్ యాప్ లింకును సైబర్ నేరస్థుడు బాధితుడికి పంపంచాడన్నారు. యూట్యూబ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించి, తర్వాత కొన్ని టాస్క్ ఉంటాయని, వాటిలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయని నమ్మించాడన్నారు. తరువాత చిన్నగా స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి మనీ ఎక్కువ అయ్యేవరకు చూసి ఇంకా చేయాలని, మధ్యలో స్టార్ట్ చేస్తే మనీ హోల్డ్ అవుతుందని చెప్పి నమ్మించి, బాధితుడి వద్ద మొత్తం 7,75,000 లని కాజేశారని ఎస్పీ తెలిపారు.
సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితురాలికి గుర్తు తెలియని నెంబర్ నుంచి ఇండియన్ పోస్ట్ సర్వీసెస్ నుంచి ఒక పార్సెల్ వచ్చిందని, అది హోల్డ్లో ఉందని రూ.5 ట్రాన్స్ఫర్ చేస్తే పార్సిల్ వస్తుందని నమ్మించాడన్నారు. తర్వాత ఓటిపి చెప్పగానే బాధితురాలి అకౌంట్లో నుంచి రూ.43,974 నష్టపరిచారన్నారు.
సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు మీ షో ఆప్ కస్టమర్ కేర్ నెంబర్ ని గూగుల్ లో సెర్చ్ చేసి, ఆ నెంబర్ కి కాల్ చేశాడన్నారు. దీంతో అది సైబర్ నేరస్తునికి కలిసిందని, కాగా నేరస్థుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కి బాధితుడు ఫాలో అయ్యాడన్నారు. సైబర్ మోసగాడు చెప్పిన విధంగా ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేసి బ్యాంకు డీటెయిల్స్ అండ్ క్రెడియన్షియల్స్ చెప్పడం ద్వారా బాధితుడు 8000 నష్టపోయాడన్నారు. అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే వీడియో కాల్స్ లిఫ్ట్ చెయ్యవద్దని, చేస్తే వాళ్ళు నగ్నంగా ఉండి, చేసిన వీడియో కాల్ రికార్డు చేసి, బెదిరించి డబ్బులు లాగేస్తారన్నారు.
వేలల్లో పెట్టుబడి, లక్షల్లో లాభాలు అంటూ వచ్చే వాట్సాప్, టెలిగ్రామ్ ప్రకటనలను నమ్మవద్దన్నారు.
తక్కువ డబ్బులు పెట్టినప్పుడు లాభాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినప్పుడు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తారన్నారు. ఇలాంటి సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కి కాల్ చేయాలన్నారు.
ఉద్యోగం ఇస్తాం అంటూ మెసేజెస్ చేసి, డబ్బులు కట్టమంటున్నారంటే సైబర్ మోసగాళ్ళుని గ్రహించాలన్నారు.