సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
వర్షాకాలం దృష్ట్యా సెస్ లో పనిచేసే హెల్పర్లకు, అసిస్టెంట్ హెల్పర్లకు, లైన్ మేన్ లకు, సిబ్బందికి రెయిన్ కోట్స్ ను అందించినట్లు సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా దార్నం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సిరిసిల్ల సెస్ లో టౌన్ వన్, టౌన్ టు లో పనిచేసే 40 మంది సిబ్బందికి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రెయిన్ కోట్స్ ఇవ్వడం జరిందన్నారు. ఎక్కడైనా కరెంటులో అంతరాయం ఏర్పడినప్పుడు అదే సమయంలో వర్షం వస్తె వెంటనే స్పందించి వెళ్లేందుకు ఈ రెయిన్ కొట్స్ ఉపయోగపడతాయని తెలిపారు. సెస్ సిబ్బంది యొక్క యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని ఈ సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు.