> జడ్చర్ల మున్సిపల్ బిఆర్ఎస్ కార్యకర్తలు.
> మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దొరేపల్లి లక్ష్మీ రవీందర్.
మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా ప్రారంభించనున్న నార్లాపూర్ పంప్ హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న బాహుబలి మోటార్లను స్విచ్ ఆన్ చేసి జాలాల ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. పాలమూరు బీడు భూములకు కృష్ణా జలాలు పారనున్నాయని నార్లపూర్ వద్ద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో బీడు భూములు పచ్చని పంట పొలాలుగా మారబోతున్నాయని , ఈ సందర్భంగా మాజీ మంత్రి వర్యులు, మహబూబ్ నగర్ జిల్లా బీ, ఆర్, ఎస్, పార్టీ అధ్యక్షులు, జడ్చర్ల శాసన సభ్యులు డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి, ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో బొంగురాల గుట్ట వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జడ్చర్ల మున్సిపాల్ పరిదిలోని ప్రతి వార్డు నుండి అధిక సంఖ్యలో మహిళ లతో కలిసి జడ్చర్ల మున్సిపాల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్. బహిరంగ సభకు బయలుదేరారు. మున్సిపాల్ కౌన్సిలర్స్ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు,బీ, ఆర్, ఎస్, సీనియర్ నాయకులు దోరేపల్లి రవీందర్ , బీ, ఆర్, ఎస్, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.