మణిపూర్ ఆదివాసిల పై దాడులకు ప్రపంచమే సిగ్గు పడుతుంది
ఆది వాసిలరక్షణ అడవుల రక్షనలోనే
కారేపల్లి నేటి ధాత్రి:
సిపిఐ(ఎంఎల్ )న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సింగరేణి మండలంలో పోలంపల్లి పంచాయతీ లో నాగయ్య గుంపు ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఆ సందర్భంగా సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గూగులోతు తేజ్యనాయక్ మాట్లాడుతూ.
ప్రపంచ ఆదివాసీల మనుగడకు ప్రమాదం తెస్తున్న మోడీ.
మణిపూర్ ఆదివాసీలపై దాడులకు ప్రపంచమే సిగ్గుపడుతుంది.
ఆదివాసి రక్షణ అడవుల రక్షణలోనే. మోడీ బాటలో కేసీఆర్. మనుగడ కోసమే ప్రతిఘటన పోరాటం చేయాలి.
కొమరం భీమ్ అల్లూరి స్ఫూర్తితో పోరాడాలి. అని ఆయన పిలుపునిచ్చారు.
ప్రపంచ దేశాల ముందు మోడీ చెప్పిన గొప్ప ప్రదేశం ఏందో మణిపూర్ ఆదివాసి మహిళలను నగ్నంగా ఊరేగింఅనాగరిక పరివర్ధించిన హిందుత్వం మతం మాదం శక్తులను చూసి ప్రపంచమే సిగ్గుతో తలదించుకుంటుందని వారు అన్నారు
ఆదివాసి ఉద్యమాల ద్వారా సాధించబడిన అటవీయ హక్కుల చట్టాలు. రాజ్యాంగం రక్షకులు బొంద పెట్టి దుకే మోడీ ప్రభుత్వం అటవీ హక్కుల సంరక్షణ నియమాలను తీసుకొచ్చిందని ఆయన అన్నారు.
ఆదివాసీ మనుగడ కోసమే సమ్మక్క సారక్క కొమరం భీమ్. అల్లూరి. గోదారిలోయ ప్రతిఘటన ఉద్యమం అమరులు. పుల్లారెడ్డి. పొట్ల రామ నరసయ్య. లింగన్న స్వామి కాచినపల్లి అమరవీరులు కామ్రేడ్ ఎల్లన్న అమరవీరులకు. ముక్తార్ పాషాన్న స్ఫూర్తితో జల్ జంగిల్ హమారా అంటూ ప్రతిఘటించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో.
ఈసం మనోజ్. కురుస అనంత రాములు. సనప అంజయ్య. ఎట్టి భద్రమ్మ. రావుల నాగేశ్వరావు. పుల్ల కానీ సత్తిరెడ్డి ధరావత్ సక్రు నాయక్. గూగులోతూ రాము.
తదితరులు పాల్గొన్నారు.