సిద్దిపేట నేటిధాత్రి…
బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ.ఆర్. మోహన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ విశిష్ట అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి యాదగిరి అతిధిగా జిల్లా ఇన్చార్జి డేగల వెంకటేష్ హాజరయ్యారు. ఈనెల 20 తారీకున సిద్దిపేట పట్టణంలో బహుజన దండయాత్ర కార్యక్రమం ఉంటుందని సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు భారీ ర్యాలీ ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్, ఏడు రాష్ట్రాల ఇంచార్జ్ , రాజ్యసభ ఎంపీరాంజీ గౌతమ్ , బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరవుతారని వారు తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గం దొర గడీల పాలన బందీ అయి ఉన్నా సిద్దిపేటను దొరల గడీల నుండి విముక్తి చేయడం కోసం సిద్దిపేట నియోజకవర్గంలో బహుజన దండయాత్రను చేస్తున్నట్లు వారు తెలిపారు. ఓటు అనే ఆయుధంతో బహుజన దండయాత్ర చేయాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రోమాల బాబు, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ బాకూరి అశోక్, గజ్వేల్ అసెంబ్లీ ఇంచార్జ్ కొండన్నల నరేష్, గజ్వేల్ అసెంబ్లీ ఇంచార్జ్ కేతుజి వినోద్ చారి, దుబ్బాక అసెంబ్లీ ఇంచార్జ్ సంజీవ్, హుస్నాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ ఎనగందుల శంకర్, హుస్నాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి నీలికొండ బిక్షపతి, సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షులు పుల్లూరు ఉమేష్, నియోజకవర్గం అసెంబ్లీ అధ్యక్షులు గూడూరు కరుణాకర్, దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు జింక సంజీవ్, హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, సిద్దిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఇర్ల మల్లేష్ ముదిరాజ్, దుబ్బాక నియోజకవర్గం కోశాధికారి శంకర్, అర్బన్ మండల అధ్యక్షుడు రాజు, నంగునూరు మండల అధ్యక్షుడు కాత మహేష్, చిన్నకోడూరు మండల ప్రధాన కార్యదర్శి కొమ్ము ప్రశాంత్ ,చందు స్థానిక నాయకులు పాల్గొన్నారు.