చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం జోగాపూర్ గ్రామం వాగ్దేవి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ సద్గుణ చారి మాట్లాడుతూ ….. బతుకమ్మ పండుగ, తెలంగాణ సాంస్కృతిక చిహ్నం… 9 రోజుల పూల సంబరం. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ. తెలంగాణ ఆడపడుచులు అంతా సంబరంగా జరుపుకునే వేడుక. బంధాలను, అనుబంధాలను గుర్తుచేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఇదో పూల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. తొమ్మిది రోజుల పాటు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబరం బతుకమ్మ పండుగ అన్నారు. ఈ పండగను పాఠశాలలో టీచర్స్, పిల్లలంతా బతుకమ్మను పేర్చి సంతోషంగా ఆటపాటలతో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రాజూరి సద్గుణ చారి, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.