పచ్చిమ టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్న పద్మజ
నేటిధాత్రి హైదరాబాద్
జనాధికార సమితి రాష్ట్ర మహిళ కోఆర్డినేటర్ గా గత 20 సంవత్సరాలు బడుగు, బలహీన వర్గాలకు తన సేవలు అందిస్తూ ఆ సేవలు విస్తరణలో భాగంగా జనాధికార సమితి మరియు బిసి సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఒక బీసీ మహిళగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ పశ్చిమ అభ్యర్థిగా పద్మజ దరఖాస్తు చేసుకోవడం జరిగినది .ఈ కార్యక్రమంలో జన అధికార సమితి రాష్ట్ర, జిల్లా నాయకులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ బిసి కుల సంఘ నాయకులు ,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర కార్యాలయంలో వరంగల్ పశ్చిమ అభ్యర్థి కొరకై దరఖాస్తును సమర్పించడం జరిగినది .ఈ సందర్భంగా నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు రాష్ట్ర శాఖ ఇంచార్జి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి యొక్క ఆశీర్వచనాలతో ఈరోజు దరఖాస్తుని సమర్పించడం జరిగినది .ఈ సందర్భంగా పలువురు నాయకులు ,మహిళలు మరియు పార్టీ అభిమానులు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.