*రైతుల పట్ల చిన్నచూపు తగదు – టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి *

జమ్మికుంట *నేటి ధాత్రి* (ఇళ్లందకుంట) : ఆరుగాలం కష్టపడి పండించిన రైతాంగం పంటలను విక్రయించే సమయంలో తెరాస ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నదాత పట్ల చిన్నచూపు తగదని టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిండ్రు. రైతుల తోటి మాట్లాడి పలు సమస్యల గురించి తెలుసుకున్నాడు వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైన ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఎలక్షన్ లు లేవు రాజకీయం చేయడానికి అసలు రాలే… తెలంగాణ రాష్ట్రంలో ఈ వ్యవసాయం ఉత్పత్తుల కొనుగోలు విషయంలో తెరాస ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది.వాళ్ల అసమర్థత వల్ల తెలంగాణ వ్యాప్తంగా రైతు నష్టపోతున్నాడు అనే ఉద్దేశంతో మేము ఈ కొనుగోలు కేంద్రానికి వచ్చి అసలు విషయం కనుక్కుని అది జనంలోకి తీసుకెళ్లాలి,ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకెళ్లాలి అని చెప్పి..పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి,కౌశిక్ రెడ్డిల ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది.వరి,మొక్కజొన్న, కందులు తదితర విషయాలల్లో ఈ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది.రైతులకు న్యాయం జరగడం లేదు,వాళ్ళు కష్టపడి పండించి అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను సరిఅయిన రేట్లతో కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ పర్యటనలు చేస్తున్నాము. జనవరి నెలలో కొన్న కందుల డబ్బులు ఒక్కరికి కూడా చెల్లించలేదు.కొనుగోలు చేసిన ధాన్యానికి కొద్దిమందికి మాత్రమే డబ్బులు చెల్లించినారు. ఎం ఎస్ పి మీద కొనుగోలు చేయాలి.కొనుక్కున్న దానికి తొందరగా డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చాలా స్పష్టంగా 40 కిలోల వరి ధాన్యం బస్తాకి అధికారికంగా ఈ కేంద్రంలో ని రైతు దేవేందర్ రెడ్డికి చెందిన ఆ వడ్లను ఒక బస్తాకి నలభై రెండు కిలోల 150 గ్రాములు ఎందుకు అంతా కోలిచిండ్రు,ఎవరు ఆదేశాలు ఇచిండ్రు… ఎవరు ఆదేశాలు ఇచ్చినా ఇది చట్ట వ్యతిరేకం,రైతు వ్యతిరేకం దీనికి ముఖ్యమంత్రే జవాబు చెప్పాలే.ఎందుకంటే ఈ నష్టం మీరు పూర్తిగా లెక్క పెడితే కోటి మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం లో ఎంత నష్టమో ఆలోచన చేయండి.అదే విధంగా మీల్లుకి వెళ్ళిన్నంక అక్కడ మళ్ళీ బస్తాకి కిలోన్నర మళ్లీ తీస్తున్నారు అంటే ఒక క్వింటాకి సుమారు 10 కిలోలు తరుగు పేరిట దోచుకుంటున్నారు. రైతుకు ఈ స్థాయిలో నష్టం ఎవరు కలిగిస్తున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారంలో ఉన్న పెద్ద మనుషులు,మంత్రులకి రైస్ మీల్లర్లతో ఏమైనా సంబంధం ఉందా… దీంట్లో ఏమైనా లాలూచీ ఉందా.. తప్పనిసరిగా ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. మొన్న తాలూగాళ్ళు అన్నారు.ఎవడు తాలూ గాడో ఇప్పుడు జవాబు చెప్పాలి.మరి ఎందుకు రైతులను అవమాన పరుస్తున్నారో,ఎందుకు ఈ విధంగా అవమానపరుస్తున్నారో, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు తప్పకుండా 40 కిలోలు అంటే నలభై కిలోలే జోకాలే..అదేవిధంగా రైతు పేరుమాండ్ల శ్రీనివాస్ 20 రోజులు అయింది.ఈ కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి.టోకెన్స్ ఇష్టమట ముదనష్టపు తెరాస ప్రభుత్వంలో రైతు 20 రోజులు అయినా ఇంకా ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు..అంటే వడ్లు ఎండలో ఎండాలే,వానలో తడువాలే,మళ్ళీ ఎండలో ఎండలే రైతు నష్టపోవాలే ఇలా రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుండ్రు. ఇది ప్రభుత్వ అసమర్థత కేసీఆర్ ముఖ్యమంత్రి అసమర్థత కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ సెంటర్ కు వచ్చి ప్రభుత్వ పెద్ద మనుషులు జవాబు చెప్పాలి అని నేను అడుగుతున్నా.మేము ఇంకో డిమాండ్ చేస్తున్నాము.మొత్తం ఐకెపి సెంటర్లు నడిపించే సామ్ బావ సంఘాలకీ ఎంత కమిషన్ రావాలో క్వింటాల్ కు 32 రూపాయలు చొప్పున వెంటనే విడుదల చేయాలి. హమాలీ చార్జీలు క్వింటాలుకు 40 రూపాయలు ప్రభుత్వమే భరించాలి.ఇది కూడా వెంటనే అమలు చేయాలని అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,నేను ఈ ఇల్లందకుంట టెంపుల్ దగ్గర నుండి ముఖ్యమంత్రి కి సవాల్ చేస్తున్న,మీరు వస్తారా లేక మీ మంత్రులను మా దగ్గరికి పంపుతారా..చత్తీస్ఘడ్లో ఈరోజు కూడా రైతుల ధాన్యాన్ని 2500 రూపాయలకు కొంటున్నారు.మేము ఇక్కడ 2500 రూపాయలు అడగలే ధాన్యాన్ని నిబంధనల ప్రకారంగా కోణాలని రైతులను దోపిడికి గురి చేయవద్దని చెబుతున్నానని అన్నారు. ఎం ఎల్ సి టి.జీవన్ రెడ్డి మాట్లాడుతూ,రైతంగం యొక్క సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలిద్దామని ఇవాళ ఇక్కడికి వచ్చినాము.రైతులతో వివరాలు సేకరించడంతోని ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది.క్షేత్రస్థాయిలో రైతుకు న్యాయం జరిగేలా,దాని గురించి ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శ పాడి కౌశిక్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, జనగాం,పెద్దపెల్లి జగిత్యాల జిల్లాల డిసిసి అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి,ఈర్ల కొమురయ్య,లక్ష్మణ్,కోరుట్ల ఎమ్మెల్యే అభ్యర్థి మేడిపల్లి సత్యం,సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్,కాంగ్రెస్ నాయకులు పోల్నేని సత్యనారాయణరావు,పొడేటి రామస్వామి,ఎక్కటి సంజీవ రెడ్డి,పత్తి కృష్ణారెడ్డి,కాసుబోజుల వెంకన్న,గూడెపు సారంగపాణి,గాజుల భాస్కర్,సాయిని రవి,దరుగుల రాకేష్,పెద్ది కుమార్,కనుమల్ల సంపత్,పోడేటి వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *