వేములవాడ:నేటిధాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రేపు జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రమేష్ బాబు..
కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు చెన్నమనేని రాజేశ్వరరావు శతజయంతి సందర్భంగా రేపు నిర్వహించే రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లతో ఎమ్మెల్యే పరిశీలించారు…
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రమంత్రి శ్రీనివాస్ గౌడ్, బోయినిపల్లి వినోద్ కుమార్ హాజరవుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలీబాల్ టోర్నమెంట్ను ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు, మరియు కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు..!