నడికూడ,నేటిధాత్రి:
భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని నిర్వహిస్తున్న గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నడికూడ మండలంలో గణపతులు మండపాల్లో ఘనంగా పూజలు అందుకుంటున్నారు.మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ యూత్ వారికి విగ్రహ దాత గుర్రపు సత్యనారాయణ, కుటుంబ సభ్యులు గణపయ్యను అందజేశారు.గణపయ్యకు మంగళహారతులు,పూలు కొబ్బరికాయలు,నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులచే గణపతికి పూజలు నిర్వహించారు.మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతిని దర్శించుకుని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ఎలకంటి రాజు, గుర్రపు వీరప్రసాద్,రమేష్,రాజేష్,పున్నం, సురేష్, అరవింద్,శ్రావణ్,శివ, సాయి,రాకేష్,అఖిల్,అంజి, రోహిత్,ప్రదీప్,రాజు,రిత్విక్ సలీం,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.