రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ అల్ఫోర్స్ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారంలో భాగంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చెర్మెన్ వి.నరేందర్ రెడ్డి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ చెట్ల పెంపకాన్ని ప్రాముఖ్యతను మరియు ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటాల్సిందిగా తెలియజేశారు. మరియు సుమారు రెండు వందల మొక్కలు విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగినది. ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినివిద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.