ముఖ్యమంత్రి ఫార్మసిస్ట్ ల సమస్యలు పరిష్కరించండి

రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ డిమాండ్

హైదరాబాద్, నేటిధాత్రి:

తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గా బత్తిని సుదర్శన్ గౌడ్ ఎన్నిక.
తెలంగాణ ప్రభుత్వ ఫార్మ సిస్ట్ ల అసోసియేషన్ కేంద్ర కమిటీ కార్యవర్గ సమావేశం ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రి,హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాలిగామ అశోక్ గారి అధ్యక్షతన జరిగింది.
గత అడ్ హాక్ కమిటీ కాల పరిమితి ముగిసి నందున నూతన రాష్ట్ర కార్య వర్గాన్ని ఎన్ను కున్నారు.
నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గా బత్తిని సుదర్శన్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కందకట్ల శరత్ బాబు, అసోసియేట్ అధ్యక్షులు జె. అశోక్, జనరల్ సెక్రటరీ గా జె. సురేష్ కళ్యాణ్, కోశాధికారి గా యాదయ్య, చీఫ్ అడ్వైసర్ గా అబ్దుల్లా ఖాన్,గౌరవ అధ్యక్షులు గా వేణుగోపాల్ రెడ్డి, అడ్వాజర్ గా మూతార్,ప్రత్యేక ఆహ్వానీతులు గా శ్రీధర్ రెడ్డి,తో పాటు 33 మంది ని కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్ని కైన రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్ మాట్లాడుచూ వైద్య ఆరోగ్య శాఖ లో ఫార్మసిస్ట్ ల పాత్ర చాలా కీలక మైన దని , ప్రపంచం లోని అభివృద్ధి చెందిన దేశాల్లో ఫార్మసిస్ట్ లకు అత్యధిక వేతనాలు, మంచి గుర్తింపు నిస్తున్నారని, కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారుచేసి కోట్లాది మంది ప్రాణాలు కాపాడిన ఘనత ఫార్మసిస్టులదే అని, కానీ మన తెలంగాణ రాష్ట్రం లో ఫార్మసిస్టులకు ఎటువంటి గుర్తింపు లేదని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించి ఫార్మసిస్టులకు డాక్టర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, ఫార్మసిస్టు లను ఫార్మసీ ఆఫీసర్లుగా
పేరు మార్చాలని, ప్రతి ఫార్మసిస్టుకు అతని సర్వీసులో కనీసం నాలుగు రకాల ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రతి జిల్లా ఫార్మసీ స్టోర్స్ లో ఫార్మసీ సూపర్వైజర్ పోస్ట్, ప్రతి జిల్లా వ్యాక్సిన్ స్టోర్ లో ఒక ఫార్మసిస్ట్ గ్రేడ్ వన్ పోస్టు, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు ఫార్మసిస్టులను ఇవ్వాలని,డిమాండ్ చేసారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ కేసీఆర్ గారు గత తొమ్మిది సంవత్సరాల క్రితం పలు బహిరంగ సభల్లో స్వయంగా ప్రకటించిన విధంగా నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న సెంటర్స్ ఫార్మసిస్టు లందరికీ వెంటనే రెగ్యులర్ చేయాలని, ఇటీవల డాక్టర్స్ కు కుడా రెగ్యులర్ చేశారని వారిని చేసిన విధంగా నైనా ఫార్మసిస్టులను రెగ్యులర్ చేయాలని,ఒకవేళ రెగ్యులర్ చేయ నట్లయితే సుప్రీంకోర్టు ఆదేశాను సారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, డిమాండ్ చేసారు.ఫార్మసిస్టులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద ఒక సమగ్ర నివేదిక తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి గారి దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!