ముఖ్య అతిధిగా సోదా రామకృష్ణ,సి.ఐ కర్ణాకర్
పరకాల నేటిధాత్రి(టౌన్)
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 53వ డివిజన్ పరిది లో శ్రీ గజనన భజన మండలి మూడు చింతల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక కార్పొరేటర్ సోదా కిరణ్ ఆధ్వర్యంలో గజానన భజన మండలి మండపం వద్ద మహిళలను ప్రోత్సహించడానికి లక్కీ డ్రా పద్ధతిలో మహిళా సోదరిమలను పదిమందిని ఎంపిక చేశారు.ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హనుమకొండ డిసిపి పి.సంజీవ్,విశిష్ట అతిథిగా గజనాన భజన మండలి అధ్యక్షులు సోద రామకృష్ణ లు హాజరై గెలుపొందిన మహిళలకు చీరలు బహుకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హన్మకొండ సి.ఐ.నడిగొట్టు కర్ణాకర్ రావు,మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రేగూరి జయపాల్ రెడ్డి,పరకాల పిఎసిఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి,పరకాల మున్సిపాలిటీ పదవ వార్డ్ కౌన్సిలర్ పసుల లావణ్య రమేష్,గజనన భజన మండలి సభ్యులు కూర రాజేందర్,చందు,రాకేష్,మనీష్ తదితరులు పాల్గొన్నారు.