భారత రాష్ట్రపతి గారి పర్యటన ములుగు జిల్లా రామప్ప పర్యటన లో పాల్గొని హెలిప్యాడ్ కి చేరుకొని హైదరాబాదుకు తిరిగి బయలుదేరిన శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి 

స్వాగతం పలికిన ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య, ఐఏఎస్ మరియు ఐటిడిఏ పిఓ అంకిత్ ఐఏఎస్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు

గౌరవ రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్య రాజన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తదితరులు ఉన్నారు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 2.55 గంటలకు రామప్ప వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామప్ప యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డిలకు మంత్రి సత్యవతి రాథోడ్,జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఎస్ పి సంగ్రామ్ సింగ్ జి. ఐ టీ డి ఎ పి ఓ అంకిత్,రాష్ట్ర పతి కి హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు

దేవాలయం లో రాష్ట్ర పతి బృందానికి మంత్రులు డా. వి శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు , పల్లా రాజేశ్వర్ రెడ్డి గార్లు రాష్ట్ర పతి కి స్వాగతం పలికారు.

రామప్ప దేవాలయానికి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం పలికారు. రుద్రేశ్వరుడిని దర్శించుకుని రాష్ట్రపతి పూజలు చేశారు. రాష్ట్రపతికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందించారు. మేడారం సమ్మక్క సారలమ్మ సారే చీర ను మేడారం ఆదివాసీ పూజారులు రాష్ట్రపతి, గవర్నర్ లకు ఇచ్చారు. ఆలయ విశిష్టత, నిర్మాణం, యునెస్కో గుర్తింపుకు కోసం తయారు చేసిన డోసియర్‌ వివరాలు, వరల్డ్‌ హెరిటేజ్‌ బాడి విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు కన్వీనర్‌ పాండురంగారావు వివరించారు. రామప్ప శిల్ప సంపద ఎంతో అద్భుతం గా ఉందని పొగిడారు.అనంతరం దేవాలయ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద 62 కోట్ల రూపాయలతో ప్రసాద్ స్కీం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య అతిథులను , వీక్షకులను ఆకట్టుకున్నాయి. పరమశివుని పై పరంపరా బృందం చేసిన ప్రదర్శన ఆధ్యాత్మిక భావన కల్గించింది. మన సంస్కృతిని చాటే విధంగా కోమ్ముకోయ కళాకారుల బృందం సమక్క సారలమ్మ ప్రదర్శన ఆకట్టుకుంది, అనంతరం బ్రహ్మంఒక్కటే పర బ్రహ్మం ఒక్కటే అనే అన్నమాచార్య గీతం పై కళాకారులు ప్రదర్శించారు.అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు.

సాయంత్రం 4.23 నిముషాలకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్ పి సంగ్రామ్ సింగ్ రాష్ట్ర పతి కి వీడ్కోలు పలికారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version