మైదానమంతా కలియతిరిగి బీఆర్ఎస్ నాయకులు, పోలీసు, ట్రాఫిక్ అధికారులకు సూచనలు చేసిన ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఖమ్మం సభ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ఆదివారం ఉదయం పరిశీలించారు, పర్యవేక్షించారు.ఈనెల 18వ తేదీన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన అనంతరం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరుగుతుంది.ఈ సభకు ఉమ్మడి ఖమ్మం,పక్కనే ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచే కాక ఆంధ్రప్రదేశ్,చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు,శ్రేయోభిలాషులు 5 లక్షల మందికి పైగా హాజరు కానున్నారు.ఈ దృష్ట్యా బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గాను బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తున్నది.ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు గంటన్నరకు పైగా మైదానమంతా కలియతిరిగి స్టేజీ నిర్మాణం,వాహనాల పార్కింగ్,ఎల్ఈడీ స్క్రీన్స్,సీటింగ్ ఏర్పాట్లు,వీఐపీ, కళాకారులు, ప్రెస్ అండ్ మీడియా గ్యాలరీలు తదితర ఏర్పాట్లను ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్సీ మధు క్షుణ్ణంగా పరిశీలించారు.వారు సభ ఏర్పాటుకు సంబంధించిన మ్యాపును పరిశీలించి బీఆర్ఎస్ నాయకులు, పోలీసు, ట్రాఫిక్ అధికారులకు పలు సలహాలిచ్చారు,సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్సీ వెంట జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు,బీఆర్ఎస్ నాయకులు బెల్లం వేణు తదితరులు ఉన్నారు.