పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన,నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించిన చల్లా

నడి కూడ, నేటి ధాత్రి:
దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శుక్రవారం నడికూడ మండలంలో చర్లపల్లి,రాయపర్తి,నడికూడ గ్రామాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు.పర్యటనలో భాగంగా రూ.3కోట్ల 68లక్షల 90 వేలతో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేశారు.
చర్లపల్లి గ్రామంలో రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం,రూ.33.90లక్షలతో ప్రాథమిక పాఠశాలలో పూర్తయిన మౌలిక వసతుల కల్పన పనుల ప్రారంభం,రాయపర్తి గ్రామంలో రూ.2కోట్ల 75లక్షలతో రాయపర్తి గ్రామం నుండి నడికూడ గ్రామం వరకు నూతన బి.టి.రోడ్డు పనులకు శంఖుస్థాపన, నడికూడ గ్రామంలో రూ.20లక్షలతో మహిళ భవనం, రూ.20లక్షలతో గ్రామపంచాయతీ భవనం ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా నడికూడ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు.నాడు వ్యవసాయం దండగ అని గత పాలకులు అన్నారు.నేడు కేసీఆర్ కృషితో వ్యవసాయం అద్భుత ప్రగతి సాధించిందని వివరించారు. నాడు కరువు కాటకాలతో కటకటలాడిన తెలంగాణ నేడు కల్పతరువుగా మారిందని, భూముల రూపురేఖలు మారిపోయి నేడు సిరుల పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్‌ రుణమాఫీ చేశారని తెలిపారు.సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణలో వ్యవసాయాన్ని చిన్నచూపు చూశారని, రైతుల బాధలను అవహేళన చేశారని అన్నారు.మహిళల్లో ఆర్థిక చైతన్యం పెరిగి, సామాజికంగా గౌరవం దక్కేలా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందని అన్నారు.మహిళా సంఘాలను బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ కు దక్కుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అన్ని అవకాశాలు కల్పించామని వెల్లడించారు.కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు నియోజకవర్గంలోని కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు.సిఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాము.ప్రజలందరి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి గ్రామ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి,రాయపర్తి గ్రామ సర్పంచ్ రావుల సరిత రాజిరెడ్డి,నడి కూడ సర్పంచ్ ఊర రవీందర్ రావు, ఉప సర్పంచ్ కిన్నెర మణి,ఎంపీటీసీ అప్పం చేరాలు, ఎంపీపీ మచ్చ అనసూర్య రవీందర్, జెడ్పీటీసీ కోడెపాక సుమలత కరుణాకర్, తాహసిల్దార్ గుండాల నాగరాజు, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్,నడి కూడ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి,ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ,మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతుబందు కన్వీనర్లు, వార్డ్ మెంబర్లు, మహిళలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు,బి.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version