పరకాల నియోజకవర్గంలో ఘనంగా చల్లా జన్మదిన వేడుకలు

నన్ను ఆశీర్వదిండానికి వచ్చిన ప్రజలందరికీ రుణ పడి ఉంటాను

పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జన్మదిన వేడుకలు బి.ఆర్.ఎస్.నాయకులు ఘనంగా నిర్వహించారు.అనంతరం పరకాల క్యాంప్ కార్యాలయంలో మహిళలు బోనాలతో ఆట పాటలతో నృత్యాలు చేశారు.ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమని అభివృద్ధి చేసిన నాయకుడి వెంట ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.మీ ప్రేమాభిమానాలకు నేను ఎల్లప్పుడూ రుణ పడి ఉంటానాని మీకు మరింత సేవ చేసె అవకాశం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పరకాల,నడికూడా మరియు పరకాల పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version