.. జనాభా ప్రకారం ముదిరాజులకు సీట్లు కేటాయించాలి.
.. పోచమ్మల అశ్వినిముదిరాజ్.
రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి.
వచ్చే ఎన్నికల్లో ముదిరాజులకు జనాభా ప్రకారం సీట్లు కేటాయించాలని పోచమ్మల అశ్విని డిమాండ్ చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న ముదిరాజులకు అధికార ప్రతిపక్ష పార్టీలు జనాభా ప్రకారo సీట్లు కేటాయించాలని
డిమాండ్ చేశారు. అధికార పార్టీ ముదిరాజులను వివక్షకు గురిచేస్తుందని ఈ విషయంలో కామారెడ్డిలో ధర్మ యుద్ద ర్యాలీ చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ముదిరాజులు అధిక సంఖ్యలో పాల్గొని మన సత్తా చాటాలని ఆమె పేర్కొన్నారు. మొదటినుండి ముదిరాజుల పట్ల అధికార పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. పార్టీలకతీతంగా ముదిరాజులకు సీట్లు కేటాయిస్తే అందరికీ మద్దతు తెలుపుతామని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎర్రం ఆంజనేయులు. దేవుని నర్సింలు. సార్గు బాగయ్య తదితరులు పాల్గొన్నారు.