ప్రభుత్వం ఎక్కడైనా దొంగ జీవోలు ఇస్తదా…?
ఒక్క ప్రాజెక్టు వెనక్కి పోయిన ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదిస్తాం..
ఎన్నికలలో గెలవలేదని అధైర్యపడద్దు
వచ్చే ఎన్నికలలో అత్యధిక స్థానాలను బిఆర్ఎస్ పార్టీవే..
నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట నియోజకవర్గం ప్రజలు,రైతుల సంక్షేమం కోసం
నేను తెచ్చిన ప్రత్యేక జీఓలు అన్ని దొంగ జీవోలని మీ స్వంత చెన్నరావుపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీతో నాపై కేసు పెట్టించావు
ఇంత దిగజారుడు రాజకీయాలు కొత్త ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి తగునా అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు.ఇలాంటి బుద్దిలేని కాంగ్రెస్ నాయకులను కొత్త ఎమ్మెల్యే తన వెంట తిప్పుకుని వారం రోజులకే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.సోమవారం నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పట్టణంలో నిర్వహించారు.ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరైయ్యారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
పథకాల పట్ల ఈ ప్రభుత్వమైనా దొంగ జీవోలు ఇస్తదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మీరు దొంగ జీవోలు ఇస్తారా అని అడిగారు.నీకు దమ్ముంటే వ్యవసాయ శాఖ మంత్రి,స్థానిక జిల్లా కలెక్టర్ తో సమీక్షా పెట్టు అని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి సవాల్ విసిరారు. బిఆర్ఎస్ పార్టీ తెచ్చిన జీవో దొంగ జీవో లైతే, మీ కాంగ్రెస్ పార్టీ రైతులకు లబ్ది ఎలా జరిగింది సబ్సిడీ ఎలా వచ్చింది అని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనీస ఇంగీతజ్ఞానం ఉండాలి కదా అని పెద్ది సుదర్శన్ రెడ్డి నిలదీశారు.దొంగ జీఓపై సమీక్షించే అధికారం కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం కొత్త ఎమ్మెల్యేకు తగదని హితువుపలికారు.రైతు పథకాల పట్ల లబ్దిపొందిన విశ్వాసం, కృతజ్ఞత లేకుండా నియోజకవర్గానికి వచ్చిన 700 కోట్ల నిధులను వెనుకకు పంపే కుట్ర చేస్తారా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తూ మరో 20 వేల మంది రైతుల నోటి దగ్గర బువ్వను కాలరాసి ఈ పథకాన్ని ఆపాలని చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా అవినీతి, అక్రమ కాంట్రాక్టు రాజకీయాలు నాకు తెలియవని పెద్ది తేల్చి చెప్పారు.నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం తెచ్చిన ఏ ఒక్క ప్రాజెక్టు వెనక్కి పోయిన, ఏ ఒక్క రూపాయి ల్యాప్స్ అయిన కాంగ్రెస్ వెంట పడటం, ప్రజాక్షేత్రంలో నిలదీయడం ఖాయమని, రైతు ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
30 ఏండ్ల నా రాజకీయ జీవితంలో ఎవరి మీద తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని పెద్ది పేర్కొన్నారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నాకోసం రాత్రింబగళ్లు కష్టపడి పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. అందరిని ఆత్మీయంగా పలకరించడం కోసమే ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఎన్నికల్లో మనం గెలవలేదని ఎవరు అధైర్య పదద్దని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు దైర్యం చెప్పారు.ఉన్న పథకాల కంటే, కొత్త పథకాలు,గ్యారంటీలు గొప్పగా ఉంటాయని చేసిన ప్రచారమో లేక దుష్ప్రచారo వల్ల ఈసారి అవకాశం రాలేదని, పోరాటాలు, గెలుపు ఓటమిలు కొత్తేమీ కాదన్నారు.సీఎం కేసీఆర్ ను ఒప్పించి నియోజకవర్గ రైతుల కొరకు 50 శాతం సబ్సిడీ కింద వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రూ. 75 కోట్ల నిధులను రాజకీయాలకతీతంగా తీసుకొచ్చిన నికార్సైన నాయకుడిని నేనని పెద్ది సుదర్శన్ రెడ్డి గర్వంగా చెప్పారు.నర్సంపేట ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఏక్కడా లేని పథకాలను రూపకల్పన చేసి రూ.700 కోట్ల నిధులు తీసుకువచ్చానని, నేను తెచ్చిన పనులను ప్రస్తుత ఎమ్మెల్యే పర్యవేక్షిస్తే చాలు అని వాటితో మీ పదవి కాలం ముగుసిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు.నర్సంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికి మాటిస్తున్నాను. కచ్చితంగా మళ్లీ నియోజకవర్గంలో ప్యానల్ పెడతా.అత్యధిక స్థానాలను బిఆర్ఎస్ పార్టీకి తీసుకువచ్చే బాధ్యత నాదేనని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఓడిసీఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ గుంటి రజిని కిషన్,వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి,రాయిడి రవీందర్ రెడ్డి,లెక్కల విద్యాసాగర్ రెడ్డి,డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి,ఎన్నారై రాజ్ కుమార్,రాయిడి దుష్యంత్ రెడ్డి,వత్తిని శ్రీనివాస్ గౌడ్,ఎంపిపిలు,జెడ్పీటిసిలు క్లస్టర్ భాద్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.