ప్రిన్సిపాల్ భర్త హాస్టల్ ను చూసుకోవడానికి ఏ అధికారం ఉంది ??
> జిల్లా కలెక్టర్ తక్షణమే ఈ యొక్క హాస్టల్ ను సందర్శించి సమస్యలను పరిష్కరించాలి.
> మీసాల రామన్న మాదిగ.
> తెలంగాణ దండోరా, తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు.
నాగర్ కర్నూల్ జిల్లా ;;నేటి ధాత్రి
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్నూరు గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలో, గత మూడు రోజుల నుండి ఫుడ్డు పాయిజన్ వలన 350 మంది పిల్లలలు అస్వస్థతకు గురి కావడం జరిగింది. శుక్రవారం నాడు విషయం తెలుసుకున్న తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రామన్న మాదిగ తన బృందంతో కలిసి, హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మీసాల రామన్న మాట్లాడుతూ… ఇక్కడ కోతుల భయం, తేనెటీగలు ఎక్కువగా ఉన్నాయని, తేనెటీ గాలకు గురైన అమ్మాయిలను ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని, బాత్రూములకు డోర్లు లేకపోవడం, త్రాగునీరు లేక గత పది సంవత్సరాల నుండి బోరింగ్ వాటరే త్రాగుతున్నారని, మెనూపకారంగా మెనూ పెట్టడం లేదు. పీటీ టీచర్ కూడా లేరు, బయోమెట్రిక్ టీచర్ లేదు, నైట్ టీచర్స్ ఇక్కడ ఉండడం లేదు, నైట్ ఒక ఆయమ్మ మాత్రమే ఉంటుందాని, నైట్ డ్యూటీ టీచర్స్ ఇక్కడ ఉండడం లేదు, పిల్లలకు చూసుకోవడానికి ఇక్కడ నర్సు మేడం కూడా లేదు, పిల్లలకు ల్యాబ్ కూడా లేదు, పిల్లలకు కనీసం కూర్చోడానికి బెంచీలు కూడా లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు రాత్రి సమయంలో చదువుకునేటప్పుడు, వారికి రక్షణ ఎవరని, ఆదివారం వస్తే విద్యార్థులు వంట చేసుకుని తినవలసిన దౌర్భాగ్యమైన స్థితి ఇక్కడ నెలకొన్నదని ఆయన తెలిపారు.
మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు బెంచీలు లేవు, ప్రిన్సిపాల్ నెలకు నాలుగు సార్లు మాత్రమే స్కూలుకు హాజరు కావడం జరుగుతుంది. ప్రిన్సిపాల్ మంగమ్మ భర్త కాశన్న హాస్టల్ ను చూసుకోవడానికి ఏ అధికారం ఉందని, మీసాల రామన్న కలెక్టర్ ను కోరారు. నెలకు సరిపోను మెనూ ను ఇక్కడ ఉన్న వంట వాళ్లకు ఇచ్చి ఒక రూములో పెట్టుకోవడం జరుగుతుందాని, ఇక్కడ స్కూల్ మొత్తంలో పిల్లలు 471 విద్యార్థులకు గాను, ప్రస్తుతానికి 30 మంది పిల్లలు మాత్రమే ఇక్కడ ఉండడం చాలా అన్యాయంగా ఉందని అన్నారు.
మిగతా వాళ్ళు మొత్తం వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లిపోవడం జరిగింది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కమలాకర్ రెడ్డిని, ప్రిన్సిపాల్ ను డిస్మిస్ చేయాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ ను, మీసాల రామన్న డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ యొక్క హాస్టల్ ను సందర్శించి, విద్యార్థుల సమస్యలన్నిటిని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు మాదిగ రాష్ట్ర కార్యదర్శి మంతటి గోపి మాదిగ, తెలంగాణ జానపద కళాకారుల సంక్షేమ సమితి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పర్వతాలు, కొల్లాపూర్ తాలూకా అధ్యక్షులు డాన్సర్ అంజి, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.