పరకాల నేటిధాత్రి(టౌన్)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 స్వచ్ఛత సేవ కార్యక్రమాల్లో భాగంగా హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గల1వ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది.జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో,సి ఎస్ ఐ సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చక్రవర్తుల మధు,బి విద్యాసాగర్,దయ్యాల సదయ్య,సెయింట్ థామస్ కరస్పాండెంట్ రెవరెండ్ ప్రదీశయ్య,ప్రిన్సిపల్ , గ్రిస్టీ,టీచర్లు హారతి రాణి, లియోన్,అమల,అను పల్లవి, ఎస్ సరళ,నవత,బి స్వామి,కే పద్మ, డి రమాదేవి,డి ధనలక్ష్మి, జి శారద,బి అనిత,కే హనుమాన్ ప్రసాద్,కే ప్రవీణ్ కుమార్,జి సారంగపాణి, బి జ్యోతి,మున్సిపాలిటీ అధికారి నీ ఎండి షమీం,ఆర్ పి జయప్రద,యువకులు మరుపట్ల మహేష్,బి అంజి, బి విల్సన్,వార్డు ప్రజలు, ఉద్యోగులు,స్వచ్ఛంద సంస్థల సభ్యులు,మహిళలు, యువత,విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.