చండూరు సెప్టెంబర్ 26 నేటిదాత్రి:
చండూరు మండలం నెర్మట గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో చాకలి ఐలమ్మ 128వ జయంతి,ఘననివాళి నెర్మట సర్పంచ్ నందికొండ నర్సిరెడ్డి,పంచాయతీ కార్యదర్శి శేఖర్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం చండూరు మండల చాకలి ఐలమ్మ సంఘం అద్దక్షుడు నాగిళ్ళ శంకర్ మాట్లాడుతూ,భూమికోసం, భుక్తి కోసం.వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి
తెలంగాణ ప్రజల తెగువను. పోరాట స్ఫూర్తిని
ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీరవనిత
చాకలి ఐలమ్మ 128 వ జయంతి సందర్భంగా చైర్ పర్సన్ వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు..
ఈ కార్యక్రమంలో రావుల మల్లయ్య, నాగిళ్ళ వెంకటయ్య, శాలివాహన చండూరు మండల అద్దక్షుడు మాడ్గుల నర్సింహ, బిజెపి యువనాయకులు నారపాక రాజేందర్,కడారి లింగస్వామి, నారపాక యాదయ్య, ఈరగట్ల శ్రీశైలం,నారపాక జలెండర్, గ్రామపంచాయతీ సిబ్బంది ఈరటి శ్రీశైలం, నారపాక యాదయ్య,నాగిళ్ళ లక్ష్మణ్,దివ్య,అలివేలు, తదితరులు పాల్గొన్నారు.