గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో
గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణపురం టౌన్ మెయిన్ రోడ్ కాంప్లెక్స్ వారి ఆధ్వర్యంలో మరియు చత్రపతి శివాజీ యూత్ గుడివాడ వడ్డెర కాలనీ గణేష్ మండపాలల్లో ఆయా కమిటీల నిర్వాహకులు ఏర్పాటు చేయగా గణనాథులను కమిటీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణ రావు సందర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయా మండపాల నిర్వహణ కమిటీ . నిర్వాహకులు గండ్ర సత్యనారాయణ రావు గారికి శాలువాలు కప్పి ఘన సన్మానం చేశారు. వారి వెంట గణపురం టౌన్ కార్యకర్తలు పాల్గొన్నారు