జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లాలోనీ కార్మిక సమస్యల పరిష్కారానికి సహాయ కార్మిక అధికారి కార్యాలయం దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. బుధవారం భూపాలపల్లి లోని మంజూరు నగర్ లో ఎన్ ఆర్ సి భవనం లో ఏర్పాటుచేసిన నూతన సహాయ కార్మిక అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ భవష్ మిశ్రా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూపాల్ పల్లి జిల్లాలో లేబర్ కార్యాలయం లేకపోవడం వల్ల 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని, ఈ ఇబ్బందిని తొలగించేందుకు ప్రభుత్వం భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో కార్మిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు.
ప్రస్తుతం సహాయ కార్మిక అధికారి కార్యాలయ నిర్వహణకు తాత్కాలిక ఏర్పాటు చేశామని, ఒక నెల సమయంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభమవుతుందని, అక్కడ మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు లేబర్ కార్యాలయానికి స్థలం అందిస్తామని , కుల సంక్షేమం కొరకు కార్మిక భవనం నిర్మాణానికి ఎకరం స్థలాన్ని కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 1991 సమయంలో 4000 మంది ఓటర్లు మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 70 వేల వరకు పెరిగిందని, పట్టణంలో విస్తృతంగా కార్మికుల సంఖ్య పెరుగుతుందని, ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాల నిర్మాణం కలెక్టరేట్ నిర్మాణం వంటి భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ప్రైవేట్ రంగంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయని వీటిలో పనిచేసే కార్మికులకు నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయం ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.
కార్మికుల కార్యాలయం ద్వారా కార్మికుల సమస్య పరిష్కారం అవుతాయని, దీనిపై ప్రతివారం రివ్యూ నిర్వహించి సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ నూతన జిల్లాగా ఏర్పడిన భూపాలపల్లిలో రిజిస్ట్రేషన్, కార్మిక కార్యాలయం ఏర్పాటు కాలేదని, వీటి ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా మంజూరు చేశారని ఎమ్మెల్యే తెలిపారు.
భూపాలపల్లి లో ఉన్న సింగరేణి కార్మికులు జెన్ కో కార్మికులు భవన నిర్మాణ కార్మికులకు సహాయ కార్మిక అధికారి కార్యాలయం ఉపయోగపడుతుందని, వారి సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కార్మికుల కోసం రెండు అడ్డాలు ఏర్పాటు చేయాలని, కార్మికుల అడ్డా వద్ద వారు కూర్చునేందుకు వీలుగా షెడ్ టాలెంట్ సౌకర్యంతో ఏర్పాటు చేయాలని, దాని దిశగా జిల్లా కలెక్టర్ తో సహాయ కార్మిక అధికారి సమన్వయం చేసుకొని కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు
కార్మికుల కు ప్రభుత్వం నుంచి అందించే వివిధ పథకాలు, పరీహారం క్లెయిమ్ సకాలంలో అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో 1% సెజ్ విధించి కార్మికుల అభ్యున్నతి కోసం ఫండ్ ఏర్పాటు చేశామని, అందులో అవసరమైన మేర నిధులు అందుబాటులో ఉన్నందున కార్మిక సమస్యలను సత్యం పరిష్కరించుకునే దిశగా కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్మికుల కార్యాలయానికి అవసరమైన మేర సిబ్బంది ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే తాత్కాలికంగా కలెక్టరేట్ నుంచి కొంత సిబ్బందిని కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. జిల్లాలోని కార్మికులకు సత్వర సేవలందిస్తూ వారి సమస్యల పరిష్కారానికి నూతనంగా ఏర్పడ్డ కార్మిక కార్యాలయం పనిచేయాలని ఎమ్మెల్యే తెలిపారు.
అనంతరం కార్మికులకు ఈ శ్రమ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ డిప్యూటీ కమిషనర్ సామ్యూల్, జాయింట్ కమిషనర్ సునీత, కార్మిక అధికారి వినోద మున్సిపల్ చైర్మన్ వెంకట్రాణి సిద్దు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు జనార్ధన్ వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్మికులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు