ఎస్సై ఉద్యోగానికి ఎంపికైన యువకుడికి సత్కారం
*బీఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి అభినందన
చందుర్తి,నేటిధాత్రి:
వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన జవ్వాజి అరుణ్ గౌడ్ ఇటీవల విడుదలైన పోలీసు పరీక్షా ఫలితాల్లో ఎస్సై ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్బంగా జవ్వాజి అరుణ్ గౌడ్ ను శుక్రవారం
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నీలం శేఖర్,మాజీ సర్పంచ్ రాంరెడ్డి, మ్యాకల శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాజేందర్, వెంకటేశం, జవ్వాజి రామస్వామి, కాశ శ్రీనివాస్, బొడిగే అనిల్,తిరుపతి, రవి, శేఖర్, వేణు గోపాల్ రెడ్డి,రాజు ,మహేష్, అనిల్,తదితరులు పాల్గొన్నారు.