స్థానిక లైబ్రరీలో వసతులు కల్పించాలని వినతిపత్రం
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాలలో శిథిలావస్థకు చేరిన గ్రంధాలయంను పునరుద్ధరించి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు సరైన వసతులు కల్పించాలని లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేవూరి ప్రకాష్ రెడ్డిని కలిసి వినతిపత్రన్ని సమర్పించారు.పరకాల లైబ్రరీ పురాతన భవనంలో కొనసాగుతోందని చాలా ఇరుకుగా ఉన్న భవనం సరైన వెంటిలేషన్ లేక చీకటిగా ఉంటుందని,ఇన్వర్టర్ సౌకర్యం లేదని సివిల్స్,గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షల మెటీరియల్ లేక ఇబ్బందిగా ఉందని,కంప్యూటర్ లు లేక సమాచార సేకరణ ఇబ్బందిగా ఉందని కంప్యూటర్ లు ఏర్పాటు చేయాలని కోరారు.పరకాల చుట్టు పక్క గ్రామాల నుండి దాదాపు 30 మంది నిరుద్యోగులు చదువుకుంటున్నారని అన్నారు.లైబ్రరీ ప్రాంగణంలో మూత్రశాలలు లేవని అలాగే చుట్టూ పక్కన ఉన్న వివిధ షాపుల వారు లైబ్రరీ ప్రాంగణంలో మూత్రం పోయడం వల్ల దుర్వాసన వెదజల్లుతుందని అభ్యర్థులు వాపోయారు.కావున దయచేసి లైబ్రరీ ని పునరుద్ధరించి సరైన వసతులు కల్పించాలని వేడుకున్నారు.స్పందించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి లైబ్రరీ ని సందర్శించి పరిశీలించి,లైబ్రేరియన్ విశ్వనాథ్ను వివరాలు అడిగి తెలుసుకుని వెంటనే పంచాయతీ రాజ్ ఏఈ కి ఫోన్ చేసి నివేదిక తయారు చేసి పనులు తక్షణమే పూర్తి చేసి నిరుద్యోగులకు ఆటంకం లేకుండా చేయాలని ఆదేశించారు.