కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు ఐక్యంగా ఉండాలని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక తెలిపారు.ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరకగూడెం మండలంలోని భట్టుపల్లి వీరాపురం క్రాస్ రోడ్డు వద్ద తుడుందెబ్బ ఆధ్వర్యంలో కొమరం భీం విగ్రహానికి నివాళులు ఆర్పించి,ఆదివాసీ జెండాను ఆమె ఆవిష్కరించారు.ఆదివాసీలు అడవినే నమ్ముకుని జీవిస్తున్నారని,వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అండగా ఉండాలని ఆమె సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ సర్పంచులు తోలెం నాగేశ్వరరావు,పోలెబోయిన శ్రీవాణి,పాయం నర్సింహారావు,కుంజ వసంతరావు,కొమరం విశ్వనాథం,ఆదివాసి సంఘం నాయకులు పాల్గొన్నారు