ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల హాజరు
ఓదెల,నేటిధాత్రి:-
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బంది సమ్మె చేస్తుండడంతో మండల విద్యాశాఖ కార్యాలయం మూతపడింది.12 సంవత్సరాల నుండి పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని జిల్లా కేంద్రంలో చేపట్టిన వారి సమ్మె 14వ రోజుకు చేరింది. రోజుకు ఒక రీతిలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో జిల్లాలోని మండల విద్యాశాఖ కార్యాలయాలతో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కార్యకలాపాలు స్తంభించాయి.స్తంభించిన కార్యకలాపాలు సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో వీరిని గత ,12 సంవత్సరాల క్రితం నియమించి ఎం ఆర్ సి, డి ఈ ఓ కార్యాలయాల్లో అధికారులు వీరి సేవలను వినియోగిస్తున్నారు ఎం ఐ ఎస్ లు ,సీసీఓ,మెసెంజర్,ఐ ఆర్ పి,పి టి ఐ,సి ఆర్ పి, లు పెరిగిన నిత్యావసరాల ధరల వల్ల ఈ వేతనం తో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఇతర శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేసిన విధంగా, తమను కూడా రెగ్యులరైజ్ చేసి వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు.నిత్యం ఉపాధ్యాయుల ,పిల్లల వివరాలు సేకరించి డీఈవో కార్యాలయానికి పంపడం, పాఠశాల నుంచి సమాచార సేకరణ, పుస్తకాలు ,యూనిఫాంల పంపిణీ ,మధ్యాహ్న భోజన నివేదికల రూపకల్పన తదితర పనుల్లో వీరి పాత్ర కీలకం. అలాగే ప్రస్తుతం ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగుతున్నందున వీరు సమ్మెలో ఉండడంతో, వివిధ పాఠశాలల నుండి ఉపాధ్యాయులను ఈ పనుల కోసం సహకారం తీసుకుంటుండడం వల్ల ఆ పాఠశాలలో విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఇకనైనా వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మె విరమించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
మూత పడిన మండల విద్యాశాఖ కార్యాలయం…
ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల హాజరు మరియు పిల్లల హాజరు వంటి వివరాలు సేకరించే కార్యాలయం మూతపడినది… దీన్ని అనువుగా చేసుకున్న కొన్ని పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉన్నప్పటికీ కొందరు ఉపాధ్యాయులు పోత్కపల్లి మరియు ఓదెల రైల్వే స్టేషన్ పరిధికి సంబంధించి పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉన్నప్పటికీ కూడా సరిగా వేయక, వేసిన సరిగా సమయపాలన పాటించక ఇష్టారాజ్యంగా విధులకు హాజరవుతున్నారు. పై రెండు రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పాఠశాలల ఉపాధ్యాయులు ఓదెల మరియు శ్రీరాంపూర్ మండలములోని కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు ” రైలు కూత బడిగంట ” అన్నట్టుగా ఉన్నది..