-యువతకు ఆయనే ప్రేరణ..రైతులకు ఆయనే స్ఫూర్తి
-గ్రామాభివృద్ధిలో ఆయన సేవలు కీలకం
-ముల్కలపల్లి గ్రామస్తుల మనోగతం
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పెద్దాయనే కావాలి..పెద్దాయనే రావాలి..యువతకు ఆయనే ప్రేరణ..రైతులకు ఆయనే స్ఫూర్తి.. గ్రామాభివృద్ధిలో ఆయన సేవలు ఎంతో కీలకమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామ ప్రజలు వారి మనోగతాన్ని వెల్లడించారు. సర్పంచుల ఫోరం మొగుళ్లపల్లి మండల మాజీ అధ్యక్షుడు, ముల్కలపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ చదువు అన్నారెడ్డి ముల్కలపల్లి గ్రామాభివృద్ధి కోసం, గ్రామ ప్రజల కోసం ఆయన చేస్తున్న సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడుతున్నారు. గ్రామంలో పచ్చదనం పరిడవిళ్లేలా రోడ్లకిరువైపులా చెట్లను నాటించడం, రైతుల సౌకర్యార్థం రైతు వేదిక భవనాన్ని నిర్మించడం, అన్ని హంగులతో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఏర్పాటు చేయడం, గ్రామంలోని ప్రతి వాడకు సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం, సేగ్రిగేషన్ షెడ్డు, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాలను నిర్మించడంలాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, వీధిలైట్లను ఏర్పాటు చేసి గ్రామంలో కాంతులు విరజిమ్మెలా కృషి చేస్తూ..గ్రామంలోని ప్రజలకు ఎవరికి ఏ ఆపదోచ్చినా నేనున్నానంటూ అపన్న హస్తం అందించి..ఆర్థిక సహాయాలు అందించే..గొప్ప మనసున్న మహారాజు చదువు అన్నారెడ్డి అని, నిస్వార్థ సేవకుడు..ముల్కలపల్లి గ్రామాభివృద్ధి ప్రదాత ముల్కలపల్లి గ్రామ పెద్దాయనగా పేరుగాంచిన చదువు అన్నారెడ్డినే కావాలి..చదువు అన్నారెడ్డినే రావాలి అంటూ ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.