టీఆర్ఎస్ కు మద్దతుగా యాదగిరి నామినేషన్ ను ఉపసంహరింపజేసిన ఎంపీ రవిచంద్ర

కూసుకుంట్ల గెలుపునకు ఎంపీ వద్దిరాజు చౌటుప్పల్,తుప్రాన్ పేట,దండు మల్కాపురంలలో విస్త్రత ప్రచారం

చౌటుప్పల్ లో మున్నూరుకాపుల ఆత్మీయ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర

మున్నూరుకాపులతో భోజనం చేసిన ఎంపీ వద్దిరాజు

చౌటుప్పల్: మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి పోతుల యాదగిరి చేత రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నామినేషన్

ఉపసంహరింపజేశారు.నకిరేకల్ లో ఉన్న యాదగిరిని ఆగమేఘాల మీద రవిచంద్ర చౌటుప్పల్ కు పిలిపించి ఎమ్మెల్యే భాస్కరరావు, మునిసిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజులతో మాట్లాడించి ఒప్పించారు.అటు తర్వాత తన వాహనంలో చండూరు కు పంపి నామినేషన్ ను ఉపసంహరింపజేశారు.చౌటుప్పల్ పట్టణంలోని తంగెడపల్లిలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మునిసిపల్ ఛైర్మన్ వెన్ రెడ్డి రాజు, టీఆర్ఎస్ నాయకుడు, మున్నూరుకాపు రాష్ట్ర కో -కన్వీనర్ చల్లా హరిశంకర్ లతో కలిసి మున్నూరుకాపుల ఆత్మీయ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు.తంగెడపల్లిలో గడప గడపకు వెళ్లి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓట్లేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంచారు.అదేవిధంగా తుప్రాన్ పేట, దండు మల్కాపురంలలో కాలినడకన వాడవాడలా తిరిగి ఎన్నికల ప్రచారం గావించారు.తుప్రాన్ పేట మున్నూరుకాపు కుల బంధువులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి,వారందరితో కలసి భోజనం చేశారు.

కార్పోరేషన్ ఏర్పాటుకు కేసీఆర్ సుముఖం

మున్నూరుకాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కోకాపేటలో 5 ఎకరాల భూమితో పాటు 5కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పోరేషన్ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.మున్నూరుకాపుల్లో ఉన్న ఐక్యత, విశ్వసనీయత, సంస్కారాన్ని గుర్తించి తనను రాజ్యసభకు పంపారన్నారు.మున్నూరుకాపులకు చెందిన తొమ్మిది మందిని ఎమ్మెల్యేలను,ఇద్దరిని ఎమ్మెల్సీలను చేశారని,నలుగురికి కార్పోరేషన్ ఛైర్మన్ పదవులిచ్చి సముచిత గౌరవించిన కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభాకర్ రెడ్డిని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దామని రవిచంద్ర చెప్పారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం, వెన్ రెడ్డి రాజు,చల్లా హరిశంకర్,జెన్నాయికోడే జగన్మోహన్,గుండ్లపల్లి శేషగిరిరావు,చక్రం జంగయ్య,గంధం సతీష్,కేశెట్టి మహేష్,బండి సంజీవ్, వనమాల ప్రవీణ్,యాద క్రాంతి,సకినాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *