రామాయంపేట(మెదక్)నేటి ధాత్రి.
దీపావళి పండుగ ఎంత కాంతిని ఇస్తుందో ఒక్కసారి అంతే విషాదాన్ని కూడా నింపుతుంది. ఇంటిల్లిపాది ఆనంద ఉత్సహల మధ్య జరుపుకునే పండుగ రోజు ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. 24న జరగనున్న పండగ సందర్భంగా బాణాసంచా పేలి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.
అనుమతి తప్పనిసరి సిఐ చంద్రశేఖర్ రెడ్డి.
హనుమతులు లేకుంటే షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు పోలీస్ నిబంధనలు కఠిన తరం విక్రయదారులు జాగ్రత్తలు పాటించాలి. నిర్లక్ష్యం చేస్తే భారీ ఆస్తి నష్టం వాటిల్లే ప్రమాదం నాణ్యమైన టపాసులు విక్రయించాలని అనుమతి లేకపోతే చర్యలు తీసుకుంటాం.
నాణ్యమైన బాణాసంచా మాత్రమే కాల్చాలి. మందు గుండు సామాగ్రి ఇంట్లో నిల్వ ఉంచకూడదు. టపాసులు కాల్చేటప్పుడు బదులుగా ఉన్న కాటన్, నూన్ దుస్తులు ధరించాలి. కాళ్లకు పాదరక్షలు వేసుకోవాలి. బకెట్ నీళ్లు ఇసుక పక్కన ఉంచుకోవాలి కళ్ళలో మందు గుండు రేణువులు పడకుండా కళ్లద్దాలు ధరించాలి. రాకెట్లు, చిచ్చుబుడ్లు, వంటి వాటిని విశాలమైన ప్రాంతంలో మాత్రమే కాల్చాలి. ఇల్లు వాహనాలు జనావాసాల వద్ద విద్యుత్ తీగలు పెట్రోల్ బంకుల సమీపంలో కాల్చరాదు.
అనుమతి లేకపోతే చర్యలు అమర్నాథ్ గౌడ్ ఎస్ ఎఫ్ ఓ మెదక్.
వ్యాపారులు పాటించాల్సినవి తాసిల్దార్ అబ్దుల్ మనోన్.
రెండు దుకాణాల మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండాలి దుకాణాల్లో సిగరెట్టు బీడీ తాగొద్దు విక్రయించవద్దు ప్రతి దుకాణం వద్ద బకెట్లలో ఇసుక రెండు లీటర్ల నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి దుకాణంపై జింక్ లేదా సిమెంట్ రేకులను మాత్రమే వాడాలి టపాసులు గోడకు మీటరు దూరం నుంచి నిల్వ చేయాలి ఫైర్ సేఫ్టీ విద్యుత్ పరికరాలు వాడాలి షాపులో దీపాలు వెలిగించొద్దు కిరోసిన్ డీజిల్ వినియోగించద్దు.