ఆశలు` ఆడియాసలు
అందనంత అందలం…అపనిందల మయం…
ఓటుకు నోటు అట్లా` రెడ్డి రాజకీయం ఇట్లా…
సీనియర్ల ఆటలో రేవంత్ రెక్కలు కట్…
కలిసి రాని కాలంలో కాంగ్రెస్ ఎదురీత….
ఆ చేతులు కలవనని మొండికేస్తున్నాయి…
రేవంత్ రేపిన రెడ్డి దుమారం…
సీనియర్ల ఆపరేషన్`రేవంత్ పరేషాన్
సీనియర్లకు మాటొచ్చింది
మంచి ఊపొచ్చింది…
ప్రెసిడెంటు లేకుండానే తీర్మానాలకు కాలమొచ్చింది
రేవంత్‌ను అడ్డుకునేందుకు కాలం కలిసొచ్చింది
బెడిసికొట్టిన రేవంత్ ‘ రెడ్డి’ రాజకీయం…
రేవంత్‌కు దారి లేని ప్రయాణం
రేవంత్ టార్గెట్‌గా సీనియర్ల వ్యూహం..
సీనియర్లకు పొగ అనుకుంటే రేవంత్‌కే సెగ..
రేవంత్ నాయకత్వం మునుగుడా` తేలుడా?
ఆశలు పెద్దగా లేనపన్పుడు అనుకున్న వన్నీ కలిసొస్తాయి. కోరికలు తీరుతున్న కొద్దీ మరిన్ని ఆశలు పెరుగుతుంటాయి. ఆశలకు హద్దులేకుండాపోయినప్పుడు, కలిసొచ్చే కాడ, తిరగబడుతుంటాయి…అనుకున్న ఆశలు నెవరవేరడం పక్కన పెడితే ఊహించని తలవంపులు వచ్చిపడుతుంటాయి. ఆశలన్నీ ఒక్కొక్కటిగా తలకిందులౌతుంటాయి. మళ్లీ కొంత కాలానికి కలిసొచ్చే కాలం మొదలైతుంది. ఆట హరివీర భయంకరంగానే మొదలౌతుంది. కాకపోతే అడుగులు పడుతున్న కొద్ది తుస్సు ముంటుంది…ఇది ఒకసారి కాదు, రెండుసార్లు కాదు…పిపిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అనేక సార్లు ఎదురైందే…ఇక తిరుగులేదనుకున్న ప్రతి సందర్భంలోనూ ఎదురుదెబ్బలే…మిగిలిని ఎత్తుపల్లాలే…ఆయాసాలే…ఆపసోపాలే.. అదేంటో గాని కొన్ని సార్లు ఊహించినవి, చేతికందినా సంతోషం పెద్దగా నిండిరడి లేదు. .. కుదురైన రాజకీయం లేదు…అప్పుడే మోదం..అంతలోనే ఖేదం…ఆది నుంచి అంతే రేవంత్ రాజకీయం అంతా ఎగుడుదిగుడులే…అనూహ్యంగా రాజకీయాల్లోకి రాజీ లేకుండా,ఎదురు లేకుండా, బెదరులేకుండా తొలి అడుగులు బలంగా పడ్డాయి. కాలం వరమిచ్చినట్లు అనుకోగానే జడ్సీటీసి అయ్యారు. ఆ వెనకే ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత రెండుసార్లు ఎమ్మెల్యే…ఒకసారి ఎంపి…అంతబాగానే వుంది. కాని ఎక్కడో తేడాకొడుతుంటుంది. ఆది ఆయన అతివిశ్వాసమా…ముందుచూపు లేకపోవడమా? చంద్రబాబు లాంటి వారి సూచనలు గుడ్డిగా ఫాలో కావడమా? అన్నదే విచిత్రం. కాకపోతే ఇటీవల అదే చంద్రబాబు ఏ పని చెప్పినా సక్కగ చేసింది లేదన్న మాట కూడా రేవంత్‌ను అన్నట్లు సమాచారం. ఏదైనా సరే చిన్నగా చేయాల్సిన పనిని చింపి చేటంత చేసి, సాపంత పర్చి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి రాజకీయం లేకుండా చేశావని చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలమైన రోజులు కూడా వున్నట్లు చర్చ సాగిందే… చంద్రబాబు ఆఖరకు తెలంగాణ వదిలి వెళ్లిపోయేలా చేసింది. .. అయినా సరే రేవంత్‌కు మరోసారి చంద్రబాబు సాయపడ్డారంటారు. కాంగ్రెస్ గూటికి చేర్చాడంటారు. పరపతితో పిపిసి ఇప్పించాడంటారు? అయితే కాంగ్రెస్‌లో రేవంత్‌కు అందరూ జై కొడతారనుకుంటే , సీనియర్లు రుసరుసలు…ఎప్పుడూ తెగని పంచాయితీలు..ఆఖరకు డల్లాస్‌లో ఈ రోజు ఇదే తరహా రేవంత్ వ్యాఖ్యలు…నేను అన్న పదం కాంగ్రెస్ లో చెల్లదు. నాకు పదవి…నా చేతిలో గెలుపు అన్న పదాలు వాడకుండా రేవంత్ వుండలేడు… ఆ మాటలను సీనియర్లు జీర్ణించుకోలేరు…పదే పదే పేచీలు పెట్టకుండా వుండలేదు. ఓ వైపు సీనియర్లంతా సమావేశమై తీర్మాణాలు చేస్తున్నా, డల్లాస్‌లో రేవంత్ నేనేంటే నేనే అంటున్నారు.
ఇప్పటికే రేవంత్ పక్కాగా వేసిన రెడ్డి రాజకీయం బోల్తా కొట్టింది. కాకపోతే మంత్రి మల్లారెడ్డి మీద దాడితో అది ఎటు వైపు దారి తీస్తుందో అర్ధం కాకుండాపోయింది. రేవంత్ రేపిన రెడ్డి కుంపటి కాంగ్రెస్‌లో బాగానే కాకరేపింది. సీనియర్లకు మళ్లీ మాటొచ్చేలా చేసింది. రేవంత్‌ను లెక్కచేయాల్సిన అవసరం లేని కాలమొచ్చింది. ఆఖరుకు అధిష్టానానికి సీనియర్లు కొత్త కమిటీ కోసం పట్టుబట్టేదాకా వచ్చినట్లైంది. అదే జరిగితే రేవంత్ రాజకీయం రెంటీకి చెడుతుందనడంలో సందేహం లేదు. ఇక ఎటూ పోలేక, కొత్త కుంపటి పెట్టలేక, రెడ్డి రాజకీయం నమ్ముకొని సాగని కాలమొచ్చినట్లే… అన్నది కూడా నానుతోంది. ఇంత కాలం పార్టీని పట్టుకొని వేళాడుతున్న సీనియర్లకు లెక్కచేయడం లేదన్నది తెలిసిందే… ఇంతలో రేగిన రెడ్డి వివాదం నుంచి తప్పించుకునేందుకే రేవంత్ అమెరికా పయనమైండన్న మాటలు వినిపిస్తున్నాయి. అయినా రేవంత్‌ను సీనియర్లు వదిలే ప్రసక్తే లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. మాకు అన్ని వర్గాల ప్రజలు ఒక్కటే…అని జనాన్ని బ్రతిమిలాడితే తప్ప, మిగతా వర్గాలు కాంగ్రెస్‌ను నమ్మకుండా చేసుకున్నట్లైంది. రేవంత్ వ్యాఖ్ల వల్ల బడుగులు రెడ్డి నేతలను అనుమానంగా చూసే పరిస్ధితి కూడా వచ్చింది. ఇప్పుడే రెడ్డి రాజకీయం చేస్తుంటే, ఒక వేళ అధికారంలోకి వస్తే బిసి, ఎస్సీలు, ఎస్టీలు,మైనార్టీలకు ప్రాధాన్యత వుంటుందా? అన్న ప్రశ్న, చర్చ అప్పుడే మొదలైంది. ఎంత కాదన్నా తెరాసలో ఎక్కువ శాతం పదవులు అనుభవిస్తున్నది కూడా రెడ్డిలే…అక్కడ కాదనుకొని ఇక్కడకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు సిద్దంగా లేరు. అలాంటప్పుడు కేవలం రెడ్డిలను నమ్ముకొని రాజకీయం చేస్తే మిగతా వర్గాలు కూడా దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు.
నోరు తెచ్చిన తంటాతో లేని కుంపటి నెత్తిన పెట్టుకొని, మాడు మాడుతున్నా నోరు మూసుకోవాల్సిన పరిస్ధితి రేవంత్‌కు వచ్చింది. ఇలా ఏది ముట్టుకున్నా, ఏది పట్టుకున్నా, పనికి రాకుండాపోయే పరిస్ధితి రేవంత్‌కు ఆనవాయితీ అయ్యిందేమో! అన్న అనుమానం కూడా కలగమానదు. అవకాశాలు మాత్రం రేవంత్‌కు బాగానే వస్తాయి. ఆచరణలో మాత్రం బోల్తా కొడతాయి. అది స్వయం కృతాపరాధమో! లేక నమ్మిన వాళ్ల అమాయకత్వమో!! గాని అక్కడికి అంతే సంగతులు. నమ్మిన వాళ్లుకు తలవంపులు…?
సాగలేనప్పుడు, రేవంత్ కాంగ్రెస్‌లో సాగిల పడడం ఎందుకు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమౌతుంది. కాంగ్రెస్‌లో చేరినా అడుగడుగునా పిపిసి దక్కీ, దక్కనట్లు, అందినట్లే అంది దూరమైనప్పుడే కాంగ్రెస్‌ను వీడి సొంత కుంపటి పెట్టుకునేది వుండే…ఎంతో ఓపిగా, ఒద్దికగా ఎదురు చూసి, పదవి వరించినా, సీనియర్లు పెట్టే కిరికిరులతోపాటు, నోటితో తెచ్చుకునే చిక్కులు రేవంత్ రాజకీయాన్ని లుకలుకలు లేకుంగా సాగనివ్వడం లేదు…పైగా పదే పదే పాఠాలు,గుణపాఠాలు, ఒత్తిళ్లకాన్నా, ఒంటరి ప్రయాణమే మేలు..అని రేవంత్‌కు సూచిస్తున్నారు.