ఒకటవ వార్డులో భూమిపూజ కార్యక్రమం
పరకాల నేటిధాత్రి(టౌన్)
పేదవాడి సొంతింటి కల నెరవేర్చబోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి సహకారంతో హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ని ఒకటో వార్డులో లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి,పరకాల పట్టణ అధ్యక్షుడు డాక్టర్ మడికొండ శ్రీను, కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సాయి తిరుపతి రెడ్డి,కేజే థామస్,పాస్టర్ ప్రకాశం,బొచ్చు భాస్కర్,బొచ్చు జితేందర్,బొచ్చు రమేష్, మడికొండ సాంబయ్య, మడికొండ గోపి,మడికొండ సుమన్,ఎండి అజీమ్, మరుపట్ల మహేష్,వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.