ఓదెల పెద్దపల్లి జిల్లా నేటిధాత్రి:-
ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ గణేష్ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండపం వద్ద కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలందరూ పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణనాథుని కోరుకున్నారు.అనంతరం సాయంత్రం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నరు.