శేరిలిగంపల్లి, నేటి ధాత్రి:-
శేరిలింగంపల్లి లోగల బ్రిక్స్ స్కై వుడ్ అపార్ట్మెంట్స్ లో ఏర్పాటు చేసిన గణనాధుని మండపంలో స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం డివిజన్ లో గల రైల్ విహార్, సురభి కాలనీ, పాపిరెడ్డి కాలనీ, ఆరంభ టౌన్షిప్, వివిధ కాలనీలలో వినాయక చవితిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గణనాధుని మండపాల్లో గణేష్ భగవాన్ కు ప్రత్యేకంగా పూజలు చేశారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మాట్లాడుతూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసి, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని గణనాధుని కోరినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.