హన్మకొండ:కుష్టి వ్యాధి నిర్మూలన సందర్భంగా జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కె యు సి క్లాస్ నుండి సమ్మయ్య నగర్ పి, హెచ్, సి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ వెంకీ జిల్లా డీఎంహెచ్ఓ వైద్యాధికారులు ఆశ వర్కర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ కుష్టి వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు, శరీరంలో నొప్పిలేని మచ్చలు కుష్టి వ్యాధి కావచ్చునని అలాంటి మచ్చలు ఉన్నవారు వెంటనే వైద్యులకు చూపించుకోవాలని సూచించారు కుష్టి వ్యాధిని మొదటిలోని గుర్తిస్తే నయం చేసుకోవచ్చని వైద్య సదుపాయాలు ఉన్నాయని తెలిపారు, జిల్లాలో కుష్టి వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు, ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఉమాశ్రీ, లస్కర్ సింగారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌజన్య, డిప్యూటీ డెమో ప్రసాద్, డి పి ఎం ఓ కొమురయ్య, లస్కర్ సింగారం హెల్త్ సూపర్వైజర్ ఇమ్మడి బాబు, అధికారులు పాల్గొన్నారు.