* ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
వేములవాడ, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎస్పీ దంపతులకు స్థానిక డిఎస్పి నాగేంద్ర చారి మరియు సిఐ కరుణాకర్ గార్లు పూల మొక్కలు ఇచ్చి అందజేసి సాదరంగా ఆహ్వానించారు ఎస్పీ దంపతులు రాజన్నను దర్శించుకునే ముందు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో స్వస్తి పలుకుతూ ఆలయ ప్రదక్షణ చేయించిన అనంతరము కోడే మొక్కు చెల్లించుకుని ,స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ దంపతులకు స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనము చేసిన అనంతరము ఆలయ పర్యవేక్షకులు బి తిరుపతిరావు, శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదము అందజేసినారు వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఉన్నారు.